పొలిటికల్ కింగ్స్ 2025 : కేటీఆర్ ముందు పెను సవాళ్లు..Ghmc, పంచాయతీ ఎన్నికలు దుమ్ము లేపాల్సిందే?
ఇదే పట్టుదలను మరో ఏడాది కాలం పాటు కేటీఆర్ ముందుండి తీసుకుపోవాల్సి ఉంటుంది. లేకపోతే ఉన్న ఎమ్మెల్యేలు కూడా జంప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. పార్టీ నుంచి ఫిరాయింపులను కట్టడి చేసిన కేటీఆర్.. ఈ సంవత్సరంలో జిహెచ్ఎంసి అలాగే గ్రామ పంచాయతీ ఎన్నికలను కూడా ఎదుర్కొనే ఛాన్స్ ఉంది. వాటితో పాటు మున్సిపల్ ఎన్నికలు కూడా ఈ సంవత్సరం జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గ్రామపంచాయతీ ఎన్నికలు అయితే... మరో నెల రోజుల్లో జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి.
కాబట్టి గ్రామస్థాయిలో గులాబీ పార్టీని నిలుపుకునేందుకు కేటీఆర్ వ్యూహరచనలు చేయాలి. కాంగ్రెస్కు ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వకుండా... బిజెపి పార్టీని రెండవ స్థానానికి రాకుండా... ఎత్తులకు పై ఎత్తులు వేయాలి కేటీఆర్. ఒకవేళ ఇదే సంవత్సరం జిహెచ్ఎంసి ఎన్నికలు జరిగితే నిజంగా కేటీఆర్ కు పెను సవాళ్లే ఎదురవుతాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలు హైదరాబాదులో క్లీన్ స్వీప్ చేసింది గులాబీ పార్టీ.
కాబట్టి... హైడ్రా అలాగే రేవంత్ రెడ్డి తీసుకునే నిర్ణయాలను హైదరాబాద్ ప్రజల వద్దకు గట్టిగా తీసుకువెళ్లాలి. అప్పుడే గులాబీ పార్టీ హైదరాబాదులో మరోసారి జెండా ఎగరవేస్తుంది. జిహెచ్ఎంసి ఎన్నికల్లో గులాబీ పార్టీ ఎక్కువ స్థానాలు గెలిస్తే మరోసారి తెలంగాణలో అధికారం రావడం సులభం అవుతుంది. అటు మున్సిపాలిటీలో కూడా గులాబీ పార్టీ పాత్ర కచ్చితంగా ఉండాలి. కెసిఆర్ ఎక్కువగా బయటికి రావడం లేదు కనుక... హరీష్ రావు కంటే ఒక అడుగు ముందుకేసి కేటీఆర్ పార్టీని నడిపించాలి. అలా జరిగితే నెక్స్ట్ ముఖ్యమంత్రి కూడా కేటీఆర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.