ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకోవడం జరిగింది. భారత దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చరిత్ర సృష్టించారు. సోమవారం విడుదల చేసిన అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) నివేదిక ప్రకారం, దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు రికార్డుల్లోకి ఎక్కారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు రూ. 931 కోట్ల ఆస్తులతో భారతదేశంలోనే అత్యంత సంపన్న ముఖ్యమంత్రి కాగా, పశ్చిమ బెంగాల్‌కు చెందిన మమతా బెనర్జీ కేవలం రూ. 15 లక్షలతో అత్యంత పేద సీఎంగా ఉన్నారు. మొత్తం 31 మంది ముఖ్యమంత్రుల ఆస్తుల విలువ రూ.1,630 కోట్లుగా ఉన్నట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) నివేదిక వెల్లడించింది.
ఇక అటు అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన పెమా ఖండూ రూ. 332 కోట్లకు పైగా ఆస్తులతో రెండవ ధనిక ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించాడు. కర్ణాటకకు చెందిన సిద్ధరామయ్య రూ. 51 కోట్లకు పైగా ఆస్తులతో జాబితాలో మూడవ స్థానంలో ఉన్నారు. నాగాలాండ్ సీఎం నీఫియు రివ్ 46 కోట్లతో నాలుగో స్థానంలో నిలిచారు. ఆ తర్వాత మధ్యప్రదేశ్ బిజెపి ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ 42 కోట్లతో 5వ స్థానంలో నిలవడం జరిగింది. ఇలా టాప్ 5 ధనిక ముఖ్యమంత్రిలను గుర్తించారు.
అలాగే... తక్కువ ఆస్తులు ఉన్న ముఖ్యమంత్రి కూడా ఉన్నారు. మమతా బెనర్జీ 15 లక్షలతో అట్టడుగు స్థానంలో నిలిచారు. ఆ తర్వాత .. జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా 50 లక్షలతో కింది నుంచి రెండో స్థానంలో నిలిచారు. కేరళ ముఖ్యమంత్రి పినరై విజయం ఒక కోటి రూపాయలతో... కింది నుంచి మూడవ స్థానం... ఆ తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశీ, ఆ తర్వాత రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ కోటి రూపాయలతో తర్వాతి స్థానంలో ఉన్నారు.