పాకిస్తాన్లో మన్మోహన్ సింగ్ ఊరు.. ఎలా ఉందో చూశారా.. వీడియో వైరల్?
అవును, పాకిస్తానీయులు సైతం ఆయన మృతిపట్ల కన్నీరుమున్నీరుగా విలపిస్తూ ఆయన అంత్యక్రియల్లో పాల్గొనాలని ఆశపడ్డారు. అయితే ఇపుడు ఇక్కడ మన్మోహన్ సింగ్‌పై పాకిస్థానీలకు ఎందుకంతో ప్రేమో? అన్న విషయం మీ మదిలో కలుగుతోంది కదూ? మన్మోహన్ పెరిగింది భారతదేశంలోనే అయినా పుట్టింది మాత్రం పాకిస్థాన్‌లోని ఓ కుగ్రామంలో. ఇస్లామాబాద్ యాయువ్య సరిహద్దులకు 100 కిలో మీటర్ల దూరంలో ఉన్న గహ్ అనే ఊళ్లో 1932వ సంవత్సరం ఫిబ్రవరి 4వ తేదీన మన్మోహన్ సింగ్ జన్మించాడు. ఆయన తండ్రి గురుముఖ్ సింగ్ ఓ బట్టల వ్యాపారి కాగా ఆయన తల్లి అమృత్ కౌర్ గృహిణి. తల్లిదండ్రులతో పాటు మన్మోహన్ సింగ్ అక్కడే ఉండి చదువుకున్నాడు. ఆయన నాలుగో తరగతి వరకు గహ్ గ్రామంలోనే చదువుకున్నారు.
మన మాజీ చనిపోగానే ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఇక అదే ఊరిలో ఇప్పటికీ ఆయన స్వగృహం ఉందంటే మీరు నమ్ముతారా? అవును... ఆయన ఇల్లు, చదువుకున్న బడితో పాటు ఆయన రికార్డులు అన్నీ ఇప్పటికీ అక్కడ భద్రంగా ఉండడం విశేషం. ఇక తాజాగా మన్మోహన్ సింగ్ చనిపోవడంతో.. ఆ గ్రామస్థులంతా కన్నీరుమున్నీరు అవుతున్నారు. తమ కుటుంబ సభ్యుడు చనిపోయినట్లుగానే భావిస్తున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మన్మోహన్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు రావాలని ఉన్న కదురకపోవడంతో రాలేకపోతున్నట్లు చెబుతున్నారు. ఇక చదువులో ఎల్లపుడూ ఎంతో హుషారుగా ఉండే మన్మోహన్ సింగ్‌ను గ్రామస్థులు అంతా ప్రేమగా... మోహనా అని పిలుచుకునే వాళ్లట. ఇక సింగ్ కుటుంబం దేశ విభజన సమయంలో అమృత్‌సర్‌కు వెళ్లింది. అలా మన్మోహన్ సింగ్ భారతీయుడిగా మిగిలిపోగా.. ఆయన స్వగ్రామం గహ్ మాత్రం పాకిస్థాన్‌లో కలిసిపోయింది.