తమ్మినేని ఇంట పొలిటికల్ కుంపటి... భార్య, కొడుకు పక్క చూపులు.. ?
వైసీపీ సీనియర్ నాయకుడు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఇంట్లో పొలిటికల్ కుంపటి రాజకుంది. కుటుంబం అంతా వైసీపీలో ఉన్న విషయం తెలిసిందే. సీతారాం సతీమణి నుంచి కుమారుడు చిరంజీవి వరకు అందరూ వైసీపీలో యాక్టివ్ గా ఉన్నారు. ఈ ఎడాది జరిగిన ఎన్నికలలో తాను తప్పుకుని కుమారుని రంగంలోకి దింపాలని ఆయన భావించిన జగన్ అవకాశం ఇవ్వలేదు. దీంతో తమ్మినేని పోటీ చేసి ఓడిపోయారు. వచ్చే ఎన్నికలు ఎప్పుడు జరిగినా తన కుమారుడికి అవకాశం ఇప్పించే దిశగా సీతారాం అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే తమ్మినేని చిరంజీవి అడుగులు వైసీపీ వైపు కాకుండా జనసేన వైపు పడుతున్నట్టు తెలుస్తోంది. తన భవిష్యత్తు జనసేనతోనే ఉంటుందని ఆయన సంకేతాలు పంపుతున్నారు. దీనిని సీతారాం వ్యతిరేకిస్తున్నారు. వైసిపి లోనే ఉండాలని ఆముదాలవలస నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చెబుతున్నారు.
అయితే గతంలోని చిరంజీవికి జగన్ శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేసి రామ్మోహన్ నాయుడుని ఓడించు అని బంపర్ ఆఫర్ ఇచ్చారు. అయితే ఇప్పుడు తమ్మినేని ఇంట్లో సీతారాం వైసీపీలో ఉండాలని అంటుంటే .. కుమారుడు చిరంజీవి .. తమ్మినేని భార్య కూడా జనసేన వైపు మొగ్గు చూపుతున్నట్టు నియోజకవర్గంలో ప్రచారం జరుగుతుంది. జనసేనలోకి వెళదాం అని సీతారాంపై అటు భార్య .. ఇటు కుమారుడు ఇద్దరూ గత పది రోజులుగా తీవ్రమైన ఒత్తిడి చేస్తున్నారని .. ఈ కుటుంబంతో అత్యంత సన్నిహితంగా ఉన్న అనుచరులు చెబుతున్నారు. సీతారాంకు వైసీపీని వెళ్లడం ఇష్టం లేకపోయినా భార్య కొడుకు ఏ నిర్ణయం తీసుకున్న దానికి ఓకే చెప్పక తప్పని పరిస్థితుల్లో ఉన్నారని టాక్. ఏది ఏమైనా తమ్మినేని సీతారాం ఫ్యామిలీలో పొలిటికల్ కుంపటి మామూలుగా లేద ని శ్రీకాకుళం సర్కిల్స్‌లో టాక్ నడుస్తోంది.