జ‌గ‌న్ ఇద్ద‌రిని కాద‌ని ఎమ్మెల్యే సీటు ఇస్తే.. జ‌గ‌న్‌కే షాక్ ఇచ్చాడు.. :

RAMAKRISHNA S.S.
- ( రాయ‌ల‌సీమ - ఇండియా హెరాల్డ్ ) . . .

క‌ర్నూలు కు చెందిన వైసీపీ నేత ఇంతియాజ్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ పలు కీలక పోస్టులలో పనిచేశారు. కృష్ణా జిల్లా కలెక్టర్గా అప్పుడు ముఖ్యమంత్రి గా ఉన్న జగన్ కు సన్నిహితంగా ఉన్నారు. ఈ క్రమంలోనే రాజకీయాల్లోకి రావాలన్నా కోరికను జగన్ దగ్గర వ్య‌క్త పరిచారు. ఎన్నికల ముందు ఇంతియాజ్ స్వచ్ఛంద పదవీ విరమణ చేసి జగన్ సమక్షంలో వైసిపి కండువా కప్పుకున్నారు. కర్నూలు సిట్టింగ్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ను కాదని మరి ఇంతియాజ్ కు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. జగన్ వాస్తవంగా మొన్న ఎన్నికలలో కర్నూలు ఎమ్మెల్యే సీటు కోసం హ‌ఫీజ్ ఖాన్ తో పాటు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి ఇద్దరు పోటీపడ్డారు. అయితే ఆ ఇద్దరికి షాక్ ఇచ్చిన జగన్ ఇంతియాజ్ కు ఎమ్మెల్యే సీటు ఇస్తే .. ఇప్పుడు ఇంతియాజ్ జగన్ కే పెద్ద షాక్ ఇచ్చారు.

ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఇంతియాజ్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. కర్నూలు వైసీపీని మాజీ ఎమ్మెల్యేలు హఫీజ్ ఖాన్ - ఎస్వీ మోహన్ రెడ్డి ఇద్దరు కబ్జా చేశారు. ఆ మాటకు వస్తే వాళ్ళిద్దరికీ ఒకరు ఉంటే ఒకరికి పడదు .. ఇక ఎన్నికల ఓటమి తర్వాత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఇంతియాజ్ ఇప్పుడు వైసీపీని వీడుతున్నట్టు ప్రకటించారు. అంతేకాదు రాజకీయాలకు దూరంగా ఉంటానని ఆయన స్పష్టం చేశారు. ఏది ఏమైనా ఇంతియాజ్ రాజీనామాతో కర్నూలు వైసీపీకి కొత్త కృష్ణుడు రానన్నాడు. ఇక్కడ ప్రతి ఎన్నికకు వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి మారిపోతున్నారు. మరి ఈసారి మాజీ ఎమ్మెల్యేలు హఫీజ్ ఖాన్ - ఎస్వీ మోహన్ రెడ్డిలో ఎవరికైనా జగన్ అవకాశమిస్తారా ? లేదా కర్నూలు తెరమీదకు నాలుగో కృష్ణుడు వస్తాడా అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: