నాగబాబుకు బిగ్ షాక్... మంత్రి పదవిపై ట్విస్ట్ ఇచ్చిన చంద్రబాబు?
మెగా బ్రదర్, జనసేన నాయకులు నాగబాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోసం దాదాపు పది సంవత్సరాల కాలం పాటు కష్టపడ్డారు. జనసేన ను అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేశారు నాగబాబు. అయితే అలాంటి నాగబాబుకు ఇప్పటివరకు కూటమి ప్రభుత్వంలో ఎలాంటి పదవి రాలేదు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే ఎంపీ లేదా ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని జోరుగా ప్రచారం జరిగింది.
కానీ ఈ చివరికి ప్రచార కార్యకర్తగానే మిగిలిపోయారు నాగబాబు. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నామినేటెడ్ పోస్ట్ వస్తుందని కూడా చర్చ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన చైర్మన్ పదవి నాగబాబుకు వరిస్తుందని ప్రచారం అయితే సాగింది. అయితే చివరికి టీవీ5 ఛానల్ ఓనర్ బిఆర్ నాయుడుకు ఆ పదవి దక్కింది. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు కాబట్టి బిఆర్ నాయుడు ఆ పదవి ఎగిరేసుకుపోయారు.
ఇక రాజ్యసభ టికెట్ ఇస్తారని కూడా మొన్నటి వరకు ప్రచారం జోరుగా సాగింది. కానీ వైసీపీ నుంచి వచ్చిన నేతలకి ఆ టికెట్లు దక్కాయి. దీంతో మెగా బ్రదర్ నాగబాబు కు... ఏపీ కేబినెట్లో మంత్రి పదవి వస్తుందని... రెండు రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది. కొత్త సంవత్సరం లోపు ఈ పదవి... ఇవ్వనున్నారని తెలుస్తోంది. అయితే ఇలాంటి నేపథ్యంలో మెగా బ్రదర్ నాగబాబుకు ఊహించని షాక్ ఎదురైంది. ఆయనకు పదవి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నారట తెలుగు తమ్ముళ్లు.
గతంలో నందమూరి బాలయ్యను... కించపరుస్తూ... మెగా బ్రదర్ నాగబాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారట. దానికి సంబంధించిన ఆ వీడియోలు ఈ మధ్యకాలంలో వైరల్ గా మారాయి. దీంతో తెలుగు తమ్ముళ్లు.... నాగబాబుకు.. మంత్రి పదవి ఇవ్వకూడదని చంద్రబాబును కలిశారట. ఆయనకు పదవి ఇస్తే బాలయ్యకు అన్యాయం జరుగుతుందని అంటున్నారట. దీంతో మెగా బ్రదర్ నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వడంపై... నారా చంద్రబాబు నాయుడు ఒక అడుగు వెనక్కి వేసినట్లు వార్తలు వస్తున్నాయి.