ఏపీ: నాగబాబుకు..ఆ శాఖ ఖరారు.. ప్రమాణ స్వీకారం ఎప్పుడంటే..?
దీంతో మెగా బ్రదర్ నాగబాబు ఇప్పుడు మంత్రి కాబోతున్నట్లు సమాచారం. తాజాగా పార్లమెంట్ ఎన్నికలలో అనకాపల్లి నుంచి పోటీ చేయడానికి సిద్ధమైన నాగబాబు ఆ సమయంలో ఆ స్థానాన్ని బిజెపికి ఇవ్వాల్సిన పరిస్థితి రావడంతో నాగబాబుకు అక్కడ పోటీ చేసే అవకాశం మిస్సయింది. ఆ తర్వాత ఏపీ నుంచి మూడు రాజ్యసభ స్థానాలలో ఒకటి నాగబాబుకు ఇస్తారని విధంగా ఎక్కువగా ప్రచారం జరిగిన.. అందులో బీజేపీకి ఒకటి రెండు టీడీపీకి ఖాయం అయ్యాయి. దీంతో ఈ అవకాశం కూడా నాగబాబుకు రాలేదు.
కానీ ఇలాంటి సమయంలోనే చంద్రబాబు అనూహ్యంగా నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయాన్ని తీసుకున్నట్లు సమాచారం. అందుకు పవన్ కళ్యాణ్ తో కూడా చర్చలు జరిపిన తర్వాతే ప్రకటించారట. ఇటీవలే ప్రస్తుత మాండలిలో నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం జరిగింది. అవి ఇంకా ఆమోదం పొందలేదట. మరి కొంతమంది మండల సభ్యులు మార్చీలో పదవి విరమణ చేయబోతున్నారట.. అలా నాగబాబు ప్రమాణస్వీకారం చేసిన ఆరు నెలలకే మండలి సభ్యుడు కావడానికి ఎలాంటి ఇబ్బందులు లేవని..ఆ వెంటనే నాగబాబుకు సైతం మంత్రిగా పదవి ఇవ్వాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారట.
మంచి ముహూర్తం చూసుకొని మెగా కుటుంబ సభ్యులు నాగబాబు ప్రమాణస్వీకారం చేయించాలా నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రాజ్ భవన్ లో నాగబాబు ప్రమాణస్వీకారం ఉండనుందని.. ఇక ప్రస్తుతం అన్ని శాఖల మంత్రులు కరారయ్యారు.. అయితే నాగబాబుకు ప్రస్తుతం ఉన్న కందుల దుర్గేష్ పర్యవేక్షిస్తున్న సినిమాటోగ్రఫీ శాఖను సైతం నాగబాబుకు ఇవ్వబోతున్నట్లు సమాచారం.. అదేవిధంగా సామాన్య ప్రజల నుంచి వస్తున్న వినతులను పరిష్కరించేందుకు ఉన్నటువంటి శాఖనైనా నాగబాబు కేటాయించబోతున్నట్లు సమాచారం. అందుకు సంబంధించి పూర్తి వివరాలు ఈ రోజు రేపో రాబోతున్నాయట.