లో దుస్తులు చెప్పులపై.. హిందూ దేవుళ్ళ బొమ్మలు.. ఆగ్రహంతో హిందువులు..!
ఈ వాల్మార్ట్ ని బాయ్ కాట్ చేయాలంటూ ఏపీ బీజేపీ అధ్యక్షుడు అయిన విష్ణువర్ధన్ రెడ్డి తన ట్విట్టర్ నుంచి ఒక డిమాండ్ చేస్తున్నారు. ఆయన ఒక్కడే కాదు చాలామంది ఆర్ఎస్ఎస్, బిజెపి నేతలు ఇదే డిమాండ్ తో వరుసగా పోస్టులు షేర్ చేస్తూ ఉన్నారు.. మరి ఇంతకీ ఆ వాల్మార్ట్ లో ఏముందో అనే విషయానికి వస్తే.. వాల్ మార్ట్ అవాంఛనీయమైన వస్తువుల పైన హిందూ దేవుళ్ళ బొమ్మలను సైతం ముద్రించినది..ఇది ఇప్పుడు దేశమంతటా కూడా వివాదాస్పదంగా మారుతున్నది..
అండర్ వేర్లు, చెప్పులు స్విమ్ సూట్ వంటి దుస్తులపైన కూడా దేవుళ్ళ బొమ్మలను డిజైన్ చేసి మార్కెట్లో సేల్ చేస్తూ ఉండడంతో ఇలాంటి ఉత్పత్తుల పైన ముద్రించడం హిందువులకు కించపరిచే విధంగా ఉందని పలువురు హిందువుల సైతం భావిస్తున్నారు. హిందువులు పూజలు చేసేవారి మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని తెలియజేస్తున్నారు. దీంతో ఒక్కసారిగా వాల్మార్ట్ తీరు పైన ఆగ్రహాన్ని తెలియజేస్తున్నారు ప్రజలు. ఈ అంశం పైన బిజెపి నేత విష్ణువర్ధన్ రెడ్డి కూడా సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేస్తూ వాల్మార్ట్ తక్షణమే హిందువులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ అని తెలియజేశారు.. తమ ఉత్పత్తులను తిరిగి వెనక్కి తీసుకోవాలనే విధంగా తెలిపారు హిందువులను కించపరిచే విధంగా ఇవి ఉన్నాయంటూ హెచ్చరించారు. గతంలో కూడా వాల్మార్ట్ 2020లో వివిధ హిందువుల ఉత్పత్తుల పైన కూడా ముద్రించడంతో తీవ్ర నిరసనలు మొదలయ్యాయట.