మహారాష్ట్ర:ఈవీఎంల బండారం బయట పెట్టబోతున్న చిన్న గ్రామం..?
దీంతో ఒక్కసారిగా కూటమిలో పలువురు నేతలు ఈ ఫలితాల పై తమ ఆవేదన వ్యక్తం చేశారు.. అయితే ఇప్పుడు మహారాష్ట్రలోని ఒక గ్రామంలో ఫలితాల పైన ప్రజలు ఆశ్చర్యపోయారు.తాము ఓటు వేసిన వారికి కాకుండా ఇతరులకు ఓటు ఎలా పడుతుంది అంటూ ప్రశ్నిస్తున్నారు? దీంతో ఈవీఎంల స్థానంలో బ్యాలెట్ల తో నిర్వహించాలంటూ తీర్మానం చేసుకున్నది.. ఆ గ్రామం ఏదో కాదు మార్కడ్ వాడి.. ఇక్కడ బ్యాలెట్ తో రీపోలింగ్ జరగబోతోందట. ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను తమ నమ్మడం లేదని దీంతో మరొకసారి బ్యాలెట్ లతో రీపోలింగ్ నిర్వహించాలంటూ అక్కడ గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారట.
ఈ విషయం ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా చర్చి నియాంశంగా మారుతున్నదట. దేశంలో అందరి కళ్ళు ఇప్పుడు మార్కడ్ వాడి గ్రామం పైన ఉన్నట్లుగా తెలుస్తోంది.. అయితే ఇప్పుడు పరిస్థితి వదిలేస్తే చేయి దాటిపోతుందని అక్కడ పోలీసులు ఆ గ్రామానికి కర్ఫ్యూ విధించారట. అయితే ప్రభుత్వ అధికారులు మాత్రం ఎన్నికలు నిర్వహణ అనేది కూడా ఈసీ బాధ్యత అంటూ తప్పించుకుంటున్నట్లు తెలియజేసినప్పటికీ అక్కడ గ్రామ ప్రజలు మాక్ పోలింగ్ జరిగిందని మాత్రం అంటున్నారు.. ఎవరికైనా ఇలాంటి అనుమానాలు ఉంటే కోర్టులో పిటిషన్ వేసుకోవాలంటు తెలియజేస్తున్నారు.. ముఖ్యంగా ఉత్తమరావు జంఖాద్ విజేతగా నిలిచారట.. ఈయనకు 13,147 మెజారిటీ ఓట్లతో గెలిచారు. ఈయన నేషనాలిటీ కాంగ్రెస్ పార్టీ (శరద్ పవర్) కు చెందిన నేత..అయితే ఇక్కడ బిజెపి అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే రామ్ సత్పుతే ఓడిపోయారు.. అయితే గెలిచినప్పటికీ మార్కర్ గ్రామంలో పోలింగ్ పైన అనుమానం ఉందని ఆ గ్రామంలో తనకు ప్రజా బలం చాలా ఉందని.. అక్కడ బిజెపి నేతకు 1003 ఓట్లు వచ్చాయని అయితే తమకు 843 ఓట్లే వచ్చాయని అయితే ఇదంతా తమను ఆశ్చర్యానికి గురి చేస్తోందని తెలిపారు. దీంతో గ్రామ ప్రజలు కూడా ఈ విషయం మీద రీపోలింగ్ చేయాలని పట్టుబడుతున్నారు. ఒకవేళ అక్కడ బ్యాలెట్ ద్వారా ఓట్లు వేయించాలంటూ రచ్చ చేస్తున్నారట .. ఇప్పుడు ఈ విషయమే దేశమంతటా ఈవీఎంల పైన చర్చనీయాంశంగా మారింది. మరి ఏం జరుగుతుందో చూడాలి.