సెక్స్ వర్కర్లకు పెన్షన్.. ఎక్కడో తెలుసా?

praveen
ఈ ప్రపంచంలో సెక్స్ వర్కర్లను ఎలా చూస్తారో స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. వారిని ఒక మాంసపు ముద్దల్లాగా చూస్తారే తప్ప మనుషుల్లాగా పరిగణించరు. వారు ఎదుర్కొనే హింసను మాటల్లో వర్ణించడం సాధ్యమయ్యే పని కాదు. లీగల్‌గా ఆ పని చేసుకోవచ్చని పలు దేశాల ప్రభుత్వాలు చెబుతుంటాయి కానీ వారి వేశ్య వృత్తిని అసలు గుర్తించవు, వారికి ఎలాంటి ఉద్యోగ హక్కులు కూడా కల్పించవు. ఆ రంగంలోకి దిగిన వారికి పని మానేసే హక్కు కూడా ఉండదు. సెలవులు ఇవ్వరు. అనారోగ్యం బారినపడి సెలవులు తీసుకుంటే జీతం కూడా ఇవ్వరు. ఇంకా ఎన్నో నష్టాలు, కష్టాలు వారికి ఉన్నాయి. వారి చేత ఈ పని చేపించే వారిపై ప్రభుత్వాలు కఠిన శిక్షలు కూడా తీసుకోవు.
అయితే బెల్జియం అనే దేశం మాత్రం సెక్స్ వర్కర్లు కూడా మనుషులేనని, వారికి కూడా ఉద్యోగ హక్కులు కల్పించాలని డిసైడ్ అయ్యింది. అందుకే తాజాగా వారికి లేబర్ రైట్స్ కల్పిస్తూ కొత్త చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చింది. ఈ కొత్త చట్టం ప్రకారం ఇకపై ఇతర ఉద్యోగులు లాగానే సెక్స్ వర్కర్లు అన్ని ఉద్యోగ హక్కులను పొందవచ్చు. తమ ఎంప్లాయర్ తో ఎంప్లాయిమెంట్ కాంట్రాక్టు చేయించుకోవచ్చు. నచ్చిన ప్రకారం జాబ్ చేసేటట్లుగా ఆ కాంట్రాక్టు కుదుర్చుకోవచ్చు. లీగల్ రైట్స్ ఉపయోగించవచ్చు. అంతేకాదు పెయిడ్ మ్యాటర్నిటీ లీవ్ తీసుకోవచ్చు, సిక్ లీవ్స్ కు శాలరీ అందుకోవచ్చు. ఈ వృత్తి నుంచి రిటైర్ అయిపోయాక సాధారణ ఉద్యోగుల లాగానే పెన్షన్ అందుకోవచ్చు.
ఈ పని చేసేటప్పుడు నచ్చకపోతే ఎప్పుడైనా దాని నుంచి తప్పుకోవచ్చు. అలానే యజమానులు వీరిపై ఎలాంటి హింస తలపెట్టినా వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. విటులు నచ్చకపోతే వారిని తిరస్కరించవచ్చు. కొన్ని రకాల శృంగార కార్యకలాపాలలో పాల్గొనమని ముందే తెలియజేయవచ్చు. తద్వారా వీరి ఉద్యోగంపై వీరికి బాగా నియంత్రణ ఉంటుంది. అలాగే బెల్జియంలో బ్రోతల్‌ హౌస్ లు నడిపే వారు ముందుగా గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. వారు సెక్స్ వర్కర్లకు ప్యానిక్ బటన్లు, బాత్రూమ్స్‌ లో కండోమ్స్ వంటి అన్ని సురక్షితమైన సౌకర్యాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.
ఈ కొత్త చట్టం అమల్లోకి వచ్చాక అక్కడి సెక్స్ వర్కర్స్‌ యూనియన్ సభ్యులు చాలా సంతోషించారు. ఇది తమ జీవితాల్లో శుభ పరిమాణం అని పేర్కొన్నారు. తమని మనుషుల్లాగా చూసే రోజులు వచ్చాయని సంబరపడ్డారు. అయితే లోకల్‌ గవర్నమెంట్ సేఫ్టీ హైజీన్ పేర్లతో వర్కర్లకు పని దొరక్కుండా చేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు ఈ వృత్తిని మామూలు వృత్తిగా చూడటం వల్ల చాలామంది ఇందులోకి వచ్చి సమాజాన్ని బ్రష్టు పట్టించే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: