రైలు ప్రయాణం చేస్తున్నారా.. ఆలస్యమైతే కేసు వేయొచ్చట.. ఏం చేయాలంటే?

Reddy P Rajasekhar
మన దేశంలో రైలు ప్రయాణికుల సంఖ్య ఎక్కువనే సంగతి తెలిసిందే. ప్రతిరోజూ కోట్ల సంఖ్యలో రైలు ప్రయాణం చేయడం ద్వారా గమ్య స్థానాలను చేరుకుంటూ ఉంటారు. ప్రస్తుతం ప్రతిరోజూ రైళ్లు ఆలస్యంగా నడుస్తుండగా రైలు మరీ ఆలస్యమై ఆలస్యం కావడం వల్ల నష్టపోతే ప్రయాణికులు ఫోరంను ఆశ్రయించడం ద్వారా పరిహారం పొందవచ్చు. అయితే ఈ పరిహారం పొందాలంటే కొన్ని షరతులు ఉన్నాయి.
 
టికెట్ రిజర్వేషన్ చేసుకుని ప్రయాణం చేస్తున్న ప్రయాణికులు మాత్రమే ఈ పరిహారం పొందడానికి అర్హత కలిగి ఉంటారు. రైళ్లలో జనరల్ టికెట్ తో ప్రయాణం చేసే వాళ్లు మాత్రం ఫోరంను ఆశ్రయించలేరు. రైలు నిర్ణీత సమయం కంటే మూడు గంటలు ఆలస్యంగా వస్తే మాత్రమే కేసు వేసే అవకాశం అయితే ఉంటుంది. రైలు ఆలస్యానికి గల కారణాలను ప్రయాణికులకు ముందుగానే సమాచారం ఇస్తే కూడా ఫోరంను ఆశ్రయించే అవకాశం అయితే ఉండదు.
 
ప్రస్తుతం మన దేశంలోని రైళ్ల మీద యాంటీ ఫాగ్ డివైజ్ లను అమరుస్తున్నారు. ఇవి అమర్చడం వల్ల మంచు ఎక్కువైన సమయంలో రైలు వేగం తగ్గి ప్రయాణం ఆలస్యం అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆ సమయంలో డివైజ్ నుంచి ప్రయాణికుడికి నేరుగా మెసేజ్ వెళ్లే అవకాశాలు అయితే ఉంటాయి. ఆ సమయంలో ప్రయాణికుడు ఫోరంను ఆశ్రయించినా ఎలాంటి ప్రయోజనం చేకూరదు.
 
కారణానికి సంబంధించి మెసేజ్ రాని పక్షంలో మాత్రం న్యాయవాది ద్వారా లేదా నేరుగా ఫోరంలో కేసును ఫైల్ చేసే అవకాశం ఉంటుంది. తుఫాన్లు, రైలు ప్రమాదాల వల్ల రైలు ఆలస్యమైతే మాత్రం స్పెషల్ కౌంటర్ ద్వారా టికెట్ డబ్బులను తిరిగి పొందే అవకాశం ఉంటుంది. ఈ విధంగా రైలు ప్రయాణం విషయంలో ఇబ్బందులు ఎదురైతే మాత్రం కేసు వేయడం ద్వారా డబ్బులను పొందే ఛాన్స్ ఉంటుంది. తరచూ రైలు ప్రయాణం చేసేవాళ్లు ఈ విషయాలను కచ్చితంగా గుర్తుంచుకుంటే మంచిది.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: