ప్రభుత్వం గాజులు తొడుక్కొని కూర్చుందా.. సీఎం రేవంత్ ను ముఖం మీదే ప్రశ్నించిన విద్యార్థి?

praveen
ఈ మధ్యకాలంలో విద్యార్థులకు ప్రతి విషయంపై కూడా అవగాహన పెంచుకోగలుగుతున్నారు. సోషల్ మీడియా కారణంగా అన్ని విషయాలను కూడా తెలుసుకోగలుగుతున్నారు. దీంతో ఎలాంటి సబ్జెక్టుపై మాట్లాడాలన్నా అనర్గళంగా మాట్లాడుతూ ఉండడం చూస్తూ ఉన్నామ్. అయితే ఇక్కడ ఒక విద్యార్థిని ఇలాగే మాట్లాడింది. ఆమె మాట్లాడింది ఎవరి ముందో కాదు. సీఎం రేవంత్ రెడ్డి ముందు. సీఎం రేవంత్ రెడ్డి తో మాట్లాడుతున్నాము అంటే ఇక ఏదో భయం బెరుకు ప్రతి ఒక్కరిలో ఉంటుంది. కానీ ఇక్కడ అమ్మాయిలో మాత్రం భయానికి మీనింగ్ తెలియదు అని బ్లడ్ ఉందేమో అన్న విధంగా ఆమె మాట తీరు వైరల్ గా మారిపోయింది.

 ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొహం మీదే ప్రభుత్వం ఏమైనా గాజులు తొడుక్కుందా లేకపోతే ముద్దమందారం సీరియల్ చూస్తుందా అంటూ నిలదీసింది విద్యార్థిని. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థులు అందరితో కలిసి మాక్ అసెంబ్లీ నిర్వహించారు. అయితే ఇక ఈ కార్యక్రమంలో ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఒక విద్యార్థిని ఏకంగా రేవంత్ రెడ్డిని ఏకిపారేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

 మాక్ అసెంబ్లీ కార్యక్రమంలో ఒక విద్యార్థిని మాట్లాడుతూ.. అధ్యక్ష.. ఒలంపిక్స్ లో మన తెలంగాణకు ఎన్ని మెడల్స్ గెలిచిందో తెలుసా? సున్నా.. ఆర్యభట్ట కనిపెట్టిన సున్న మనకోసమే అన్నట్లు ఒక్క మెడల్ కూడా గెలవలేదు. అసలు మన స్టేట్ నుంచి ఎంతమంది ఒలంపిక్స్ లో పాల్గొన్నారు. అసలు మన ప్రభుత్వం ఏం చేస్తుంది. గాజులు తొడుక్కుని ముద్దమందారం సీరియల్ చూస్తుందా?.. దీనికి ప్రభుత్వం తప్పనిసరిగా సమాధానం చెప్పి తీరాల్సిందే అంటూ గుక్క తిప్పుకోకుండా ఏకంగా రేవంత్ రెడ్డిని మొహం మీదే ఆ విద్యార్థిని ప్రశ్నించింది. ఆ అమ్మాయి మాటలతో మిగతా విద్యార్థులు అందరూ కూడా బల్లలు కొడుతూ హర్షద్వానలు పలికారు.Your browser does not support HTML5 video.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: