కొడంగల్ లో రేవంత్ కు చుక్కలు చూపిస్తున్న అజ్ఙాత వ్యక్తి ?
కేవలం 30 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఓడిపోయినప్పటికీ కొడంగల్ నియోజకవర్గంలోనే ఉంటూ అక్కడి ప్రజల కోసం పనిచేస్తున్నారు పట్నం మహేందర్ రెడ్డి. నిత్యం జనాలతో ఉంటూ ముందుకు వెళ్తున్నారు. అంతేకాకుండా కొడంగల్ లోని ఫార్మసిటీ రైతుల కోసం కూడా పోరాటం చేస్తున్నారు పట్నం మహేందర్ రెడ్డి. వికారాబాద్ కలెక్టర్ పై దాడి చేసింది పట్నం మహేందర్ రెడ్డి అనుచరులే అని అంటున్నారు. అందుకే అతనిని అరెస్టు కూడా చేశారు.
అయితే రైతుల కోసం పట్నం మహేందర్ రెడ్డి అరెస్టు కావడంతో ఆయన.. ఇప్పుడు కొడంగల్ నియోజకవర్గంలో హీరోగా మారిపోయాడు. రేవంత్ రెడ్డి ని కొట్టగల మొనగాడిలా కనిపిస్తున్నారు. ఇప్పుడు ఎన్నికలు పెట్టిన రేవంత్ రెడ్డిని చిత్తుచిత్తుగా ఓడించే సత్తా అతనిలో వచ్చింది అని రైతులు చర్చించుకుంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో ఏ నాయకుడైన అరెస్టు అయితే వెంటనే అతడు పవర్ఫుల్ లీడర్ గా మారిపోతున్నారు. ఏపీలో చంద్రబాబు అలాగే అరెస్టయి ముఖ్యమంత్రి అయిపోయారు. ఇప్పుడు పట్నం మహేందర్ రెడ్డి ని కూడా రేవంత్ రెడ్డి హీరో చేసినట్లు చెబుతున్నారు.