ఇండియాటుడే: అబ్బో..బాబుగారిని పవర్ ఫుల్ సీఎం అనడానికి కారణాలు ఇవేనా.?

FARMANULLA SHAIK
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గురించి రాజకీయాలు తెలిసిన వారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు, తెలుగు రాజకీయాలను, నారా చంద్రబాబు నాయుడు అనే పేరును వేరు చేసి చూడలేం. ఎందుకంటే చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఆయన పేరు లేకుండా ఏ ఒక్క రోజు కూడా న్యూస్ పేపర్లు పబ్లిష్ అయ్యుండవని కచ్చితంగా చెప్పొచ్చు. సరిగ్గా ఏడాది కిందట ఇంచుమించు పదిరోజులు అటూ ఇటుగా చంద్రబాబు నాయుడు ఇదే సమయంలో జైళ్లో ఉన్నారు. స్కిల్ స్కామ్‌లో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. అయితే ఇప్పుడు దేశంలోనే మోస్ట్ పవర్‌ఫుల్ పర్సన్ జాబితాలో నారా చంద్రబాబు నాయుడు టాప్‌ 5లో నిలిచారు.ఇండియా టుడే సంస్థ ప్రకటించిన మోస్ట్ పవర్‌ఫుల్ పొలిటిషీయన్ ఇన్ ఇండియా జాబితాలో చంద్రబాబుకు ఐదోస్థానం దక్కింది. ఈ జాబితాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలి స్థానంలో నిలవగా.. ఆర్‌ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ రెండో స్థానంలో ఉన్నారు. కేంద్ర మంత్రి అమిత్ షా 3వ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ 4వ స్థానంలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు విషయానికి వస్తే బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి వరుసగా మూడోసారి కేంద్రంలో అధికారం చేపట్టిందన్నా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడోసారి పీఎం అయ్యారన్నా అది చంద్రబాబు సహకారంతోనే అనేది జగమెరిగిన సత్యం. వీటికి తోడు 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 23 సీట్లకు పరిమితమై ఘోర పరాజయం ఎదుర్కొన్న టీడీపీని ఐదేళ్లు తిరిగేసరికి అధికారం చేపట్టేదిశగా నడిపించిన నాయకుడు చంద్రబాబు.

2019 ఎన్నికల్లో ఓటమి తరువాత ఢిల్లీలో, జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు కనిపించకుండా పోయారు. ఒకానొక సమయంలో ప్రధానమంత్రి అపాయింట్మెంటు సైతం దొరకని పరిస్థితి కూడా నెలకొంది.కానీ ఇప్పుడు అదే ఢిల్లీలో, అదే జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు చక్రం తిప్పుతున్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రానికి కావాల్సింది డిమాండ్ చేసి మరీ సాధించుకునే స్థితికి చంద్రబాబు చేరుకున్నారు. అందుకే దేశ రాజకీయాల్లో అత్యంత శక్తివంతమైన నేతల్లో చంద్రబాబు టాప్‌ 5లో ఉన్నారు. అలాగే తన పరిచయాలతో, ఏపీకి పెట్టుబడులు వచ్చేలా చంద్రబాబు ముందుకు సాగుతున్నారు. స్వర్ణాంధ్ర ప్రదేశ్ విజన్ 2047 లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.లోక్‌సభలో టీడీపీకి ఉన్న 16 మంది ఎంపీలను మినహాయిస్తే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రమాదకర పరిస్థితుల్లో పడిపోతుంది. మెజారిటీ మార్కుకు దూరమవుతుంది. దీంతో పాలక ఎన్‌డీఏలో చంద్రబాబు పట్టు పెరిగింది. నాలుగోసారి సీఎం అయిన ఆయన.. తన చిరకాల స్వప్నమైన స్వర్ణాంధ్ర సాధన, రాజధాని అమరావతి నిర్మాణం లక్ష్యాలను చేరుకునే అవకాశం ఉంది,. కార్పొరేట్లకు మిత్రుడిగా ఉండే చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రానికి రెండోసారి సీఎం అయినప్పుడు ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజనెస్‌  ఏర్పాటుకు చొరవ చూపారు.15 శాతం వృద్ధి రేటుతో 2047కల్లా ఆంధ్ర ఎకానమీని 2.4 ట్రిలియన్‌ డాలర్లకు, తలసరి ఆదాయాన్ని 43 వేల డాలర్లకు తీసుకెళ్లడం ఆయన లక్ష్యం. ప్రజల భాగస్వామ్యం ఉండే వ్యూహాన్ని అభివృద్ధి చేసే విజన్‌ కావాలని ఆయన ఎప్పుడూ అంటుంటారు' అని పేర్కొంది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: