సజ్జల భార్గవ్ పై లుకౌట్ నోటీసులు.. ఏపీ సర్కార్ సజ్జలకు భారీ షాకివ్వడం ఖాయమా?
సజ్జల భార్గవ్ రెడ్డి, అర్జున్ రెడ్డి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలను చేపట్టాయని తెలుస్తోంది. వర్రా రవీంద్ర రెడ్డి పోలీసుల విచారణలో కీలక విషయాలను వెల్లడించాడని తెలుస్తోంది. సజ్జల భార్గవ్ రెడ్డి వైసీపీ సోషల్ మీడియా బాధ్యతలు తీసుకున్న తర్వాత మరింత రెచ్చిపోయామని జడ్జిలకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టాలని అతడే బెదిరించాడని వర్రా రవీంద్ర చెప్పుకొచ్చారు.
2023 సంవత్సరం నుంచి నా ఫేస్ బుక్ ఐడీతో పోస్టులు పెట్టేవాడని వైసీపీ సోషల్ మీడియాలో సజ్జల భార్గవ్, అర్జున్ రెడ్డి, సుమా రెడ్డి కీలకమని పోలీసులకు చెప్పినట్టు తెలుస్తోంది. అయితే వర్రా రవీంద్ర రెడ్డి మెజిస్ట్రేట్ ముందు మాత్రం తనతో బలవంతంగా స్టేట్మెంట్ ఇప్పించారని చెప్పినట్టు తెలుస్తోంది. సజ్జల భార్గవ్ విషయంలో ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకుంటాయో చూడాల్సి ఉంది.
సజ్జల భార్గవ్ రాబోయే రోజుల్లో ఎలా ప్లాన్ చేసుకుంటారో చూడాల్సి ఉంది. సజ్జల భార్గవ్ తనపై వస్తున్న విమర్శల విషయంలో ఏ విధంగా వ్యవహరిస్తారో చూడాల్సి ఉంది. వైసీపీ మాత్రం కేసులకు భయపడవద్దని తమ సపోర్ట్ ఉంటుందని చెబుతోంది. రాబోయే రోజుల్లో ఈ వివాదాల విషయంలో ఏం జరుగుతుందో చూడాలి. కూటమి మాత్రం భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా అడుగులు వేస్తోంది. భవిష్యత్తులో వైసీపీ ఏపీలో అధికారంలోకి వస్తే కూటమి నేతల విషయంలో ఇదే విధంగా వ్యవహరించే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.