షాక్: నటుడు పోసాని కృష్ణ మురళిపై కేసు.. అసలేం జరిగిందంటే..?
జనసేన పార్టీ కార్యకర్తలు కొంతమంది, లీగల్ సెల్ నాయకులు నటుడు పోసానికి షాక్ ఇచ్చినట్లు సమాచారం.రాష్ట్రంలో రోడ్లు బాగుకోసం గాంధీ జయంతి రోజున అందరూ కూడా శ్రమదానం చేయాలన్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపుకు సైతం సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన కొన్ని వ్యాఖ్యలు చేశారని పోసాని పైన చర్యలు తీసుకోవాలంటు తూర్పుగోదావరి జిల్లాలో జనసేన నాయకులు కొంతమంది కలిసి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అంతేకాకుండా పోసాని ఈ శ్రమదానం కార్యక్రమాన్ని అడ్డుకొనే కుట్ర చేశారనే విధంగా కూడా ఆరోపించారు.
అంతేకాకుండా పవన్ కళ్యాణ్ పైన ఆయన కుటుంబ సభ్యుల పైన ,జనసేన కార్యకర్తల పైన కూడా పలు రకాల అభ్యంతరకరమైన వ్యాఖ్యలను చేశారంటూ కేసులో నమోదు చేశారట.అలాగే వైసిపి ప్రభుత్వం హయాంలో రాజమండ్రిలో ఉన్నటువంటి కొన్ని పెండింగ్ కేసులలో కూడా పోసాని పేరు ఉండడంతో వాటికి సంబంధించిన వాటి పైన కూడా చర్యలు తీసుకొని అరెస్టు చేయాలి అంటూ జనసేన లీగల్ సెల్ నాయకులు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీని సైతం కోరడం జరిగింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మాత్రం వైసిపి సోషల్ మీడియాకు అడ్డుకట్టు వేయకపోతే రాబోయే రోజుల్లో ఇబ్బందులు తప్పని గుర్తించి వైసీపీ సోషల్ మీడియాను ఇబ్బందిలకు గురి చేస్తున్నట్లు పలువురు వైసిపి నాయకులు కూడా తెలియజేస్తున్నారు. మరి ఈ విషయం పైన అటుకోసారి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.