జ‌గ‌న్‌కు పెద్ద బూస్ట‌ప్‌... ఏపీలో వైసీపీకి మ‌రో విజ‌యం...!

RAMAKRISHNA S.S.
ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది జరిగిన సాధారణ ఎన్నికలలో వైసిపి చిత్తుచిత్తుగా ఓడిపోయింది. కేవలం 11 సీట్లకే పరిమితం అయింది. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ తో పాటు ఆ పార్టీ కీలక నేతలు కేడర్ అంతా డీలాపడి నిరాశలోకి వెళ్లిపోయింది. అలాంటి టైంలో విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో వైసీపీకి చెందిన సీనియర్ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా విజయం సాధించడం ఆ పార్టీకి జగన్కు పెద్ద బూస్టప్‌ ఇచ్చింది. ఆ విజయం దక్కి రెండు నెలలు కూడా కాకుండానే వైసీపీ ఖాతాలో మరో విజయం నమోదు కానుంది. ఉమ్మడి విజయనగరం జిల్లాలోని స్థానిక సంస్థల కోట నుంచి ఉపఎన్నిక జరుగుతుంది. ఈ క్రమంలోనే వైసిపి నుంచి బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే శంబంగి చిన‌ అప్పలనాయుడు నామినేషన్లు వేశారు.

మరో ఇద్దరు ఇండిపెండెంట్ లు కూడా నామినేషన్ వేశారు. టిడిపి లేదా కూటమి నుంచి ఎవరు నామినేషన్ వేయలేదు. ఈ లెక్కను చూస్తే కూట‌మి నుంచి ఎవరూ పోటీ చేయకపోతే వైసీపీకి విజయం ఖాయం అయినట్టే. వైసీపీ నుంచి పోటీ చేస్తున్న చిన‌ అప్పలనాయుడు గెలుపు నెల్లూరు మీద నడకే అవుతుంది. ఒకవేళ పోటీ జరిగి ఇండిపెండెంట్లు పోటీలో ఉన్న అలాగే కూడా వైసిపికి గెలుపు విషయంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. మంగళవారం నామినేషన్ స్కూటీని జరుగుతుంది. ఇండిపెండెంట్ అభ్యర్థులు విత్ డ్రా చేసుకుంటే ఉప ఎన్నికల్లో సంబంధించి గెలుపు ఏకగ్రీవం కాకపోతే ఈనెల 28న పోలింగ్ జరుగుతుంది.

విజయనగరం జిల్లాలో స్థానిక సంస్థల్లో మెజార్టీ ఓట‌ర్లు వైసీపీకే ఉన్నారు. దీంతో వైసిపి గెలుపు ఏకపక్షం కానుంది. ఇవన్నీ ఇలా ఉంటే వైసిపి నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన ఇందుకురి రఘురాజు మీద అనర్హతను హైకోర్టు రద్దు చేసిందని ప్రకటన వచ్చింది. ఆ విషయంలో ఈసీ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది. అయితే ఓవైపు ఎన్నికల ప్రక్రియ సాగిపోతుంది.. నామినేషన్ స్కూటీని అనంతరం అభ్యర్థుల పేర్లు ఖరారు చేస్తే ఇంకా పోలింగ్‌కు కేవలం 15 రోజుల సమయం మాత్రమే ఉంటుంది. మరి ఈ టైం లో ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: