ఏపీ బడ్జెట్ 2024 : సూపర్ 6 కు గుండు సున్నా?
2.94 లక్షల కోట్ల బడ్జెట్లో సూపర్ సిక్స్ పథకాల కోసం ఎక్కడ కూడా రూపాయి కేటాయించలేదని... వైసిపి మండిపడుతోంది. సూపర్ సిక్స్ హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం... బడ్జెట్లో పంగనామాలు పెట్టిందని... గుండు సున్నాతో ఏపీ ప్రజలను మోసం చేస్తోందని వైసిపి ఆరోపణలు చేస్తోంది.
అంతేకాకుండా బడ్జెట్లో నిరుద్యోగులకు... ఏపీ సర్కార్ అన్యాయం చేసిందని.. మండిపడుతోంది. బడ్జెట్లో నిరుద్యోగులకు మూడు వేల నిరుద్యోగ భృతి ప్రస్తావన లేదని... వైసిపి ఆగ్రహం వ్యక్తం... చేస్తోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే సూపర్ సిక్స్ అమలు చేస్తామని చెప్పి.... ఇప్పుడు ఏపీ ప్రజలను ముంచేసారని మండిపడుతోంది.
నెలకు 1500 ఆర్థిక సహాయం చేస్తామని ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇచ్చారని.. దానిపై ఎలాంటి కేటాయింపులు చేయలేదని... నిప్పులు జరుగుతోంది జగన్ టీం. అలాగే మహిళలకు ఏడాదికి 18 ఆర్థిక సహాయం పై... ఎలాంటి ప్రకటన చేయలేదని... ఆగ్రహం వ్యక్తం చేస్తోంది ప్రతిపక్ష పార్టీ వైసిపి. మహాశక్తి పథకానికి బడ్జెట్లో ఒక్క రూపాయి పెట్టలేదని కూడా మండిపడుతోంది. ఇది ఇలా ఉండగా... వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి కూడా ఏపీ బడ్జెట్ పై స్పందించారు. అప్పుల కుప్పగా ఏపీని మార్చుతున్నారని మండిపడ్డారు విజయసాయిరెడ్డి. ఇవాళ పెట్టిన బడ్జెట్ లో సూపర్ సిక్స్ పథకాలతో ఎలాంటి హామీలు ఇవ్వలేదని... ఒక రూపాయి కేటాయించలేదని కూడా రాజ్యసభ సభ్యులు విజయ్ సాయి రెడ్డి... నిప్పులు చెరిగారు. ఇది బూటకపు బడ్జెట్ అంటూ మండిపడ్డారు.