ఏపీ: ఆర్జీవీ కు బిగ్ షాక్..కేసు నమోదు చేసిన పోలీసులు.!

FARMANULLA SHAIK
సోషల్‌ మీడియా పోస్టులపై సీరియస్‌గానే ఫోకస్ చేసింది కూటమి సర్కార్. ప్రభుత్వంపై, కూటమి నేతలపై బ్యాడ్‌ ఓపీనియన్‌ క్రియేట్ చేసేట్లుగా పోస్టులు పెడుతున్న వారిని తొక్కి నార తీస్తామంటోంది.విమర్శ మంచిదే.. కానీ, దానికో హద్దు ఉంటుంది. విధానాల మీద విమర్శలు, రాజకీయ పోస్టులు ఓకే. బట్ పర్సనల్ అటాకింగ్, ఫ్యామిలీ టార్గెటింగ్‌ ఎక్కువై పోయింది. ఏకంగా ఆడవాళ్లను రోడ్డుకీడుస్తున్నారు కొందరు. పార్టీ సోషల్ మీడియా వారియర్స్ పేరుతో పెడుతోన్న పోస్టులు మహిళలను, రాజకీయ నేతల కుటుంబాలను హర్ట్‌ చేస్తున్నాయి. కొన్నిసార్లు పోనీలే ఊరుకుంటున్నా..ఏ మాత్రం పాలిటిక్స్‌తో సంబంధం లేనివారిని కూడా కాంట్రవర్సీలోకి లాగడంతో రచ్చ రంబోల అవుతోంది.ఈ మధ్య ఏపీలో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల ఓవరాక్షన్‌ ఎక్కువై పోయిందట. అడ్డగోలుగా పోస్టులు పెడుతూ అటు వైఎస్ షర్మిల, ఇటు పవన్ కల్యాణ్ కూతుర్లు, హోంమంత్రి అనితతో పాటు పలువురు మహిళలపై అసభ్యంగా పోస్టులు పెట్టడం ఇష్యూ సీరియస్ అయిపోయింది. ఈ నేపథ్యంలోనే ఆంద్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. గత వైసీపీ హయాంలో విచ్చలివిడగా సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోయిన వారిపై ప్రభుత్వం, అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా గతంలో ఇష్టం వచ్చినట్లు పోస్టులు, వీడియోలు పెట్టిన వారిపై చాలా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆ ఫిర్యాదుల ఆధారంగా చేసుకొని పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే పలువురు వైసీపీ కీలక నేతలు, కార్యకర్తలను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే సోమవారం టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ పై కేసు నమోదైంది. గతంలో ఆయన తీసిన వ్యూహం సినిమా సమయంలో చంద్రబాబు, లోకేష్, బ్రాహ్మణి ని కించపరిచేలా సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారని.. మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడతామని తెలిపారు. ఆర్జీవీ ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

rgv

సంబంధిత వార్తలు: