ఏపీ: నిన్న పవన్ వార్నింగ్.. మరో బాలికపై అత్యాచార ఘటన..హోంమంత్రికి చుక్కలేనా..?
ఇలాంటి సమయంలోనే నిన్నటి రోజున వార్నింగ్ ఇచ్చారో లేదో అప్పుడే మరో బాలిక పైన అత్యాచార ఘటన జరిగిన సంఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. తిరుపతి జిల్లాల యలమందలో స్కూలుకు వెళ్లేటువంటి పదవ తరగతి బాలిక మాదిగ పల్లకికి చెందిన మైనర్ బాలిక పైన ఇద్దరు దుండగులు సైతం సామూహికంగా దాడి చేసి అత్యాచారానికి పాల్పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. సాయంత్రం పాఠశాల నుంచి ఇంటికి తిరిగి వస్తున్న ఈ బాలికను స్కూటర్ పైన ఎక్కించుకొని ఇద్దరు అగంతకులు మత్తు మాత్రలు వేసి ఆమెకు బలవంతంగా అత్యాచారాన్ని చేశారట. అయితే కుటుంబ సభ్యులు ఇంకా తన కూతురి ఇంటికి రాకపోవడంతో ఆరా తీయగా ముళ్ళ పొదల్లో నిర్జీవంగా పడి ఉన్న కూతుర్ని చూసి ఒక్కసారిగా దుక్కించి పోయారు.
మైనర్ బాలికను ఆసుపత్రికి తరలించగా యలమందలో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేస్తున్న సమయంలో కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో వరుసగా జరుగుతున్న ఈ ఘటనల పైన వైసిపి పార్టీ నేతలు స్పందిస్తూ రాష్ట్రంలో మహిళలకు సైతం రక్షణ లేకుండానే ఉందంటూ అటు చంద్రబాబును కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉన్నారు. అందుకు సంబంధించి లెక్కలను కూడా వైసిపి పార్టీ బయటపెడుతోంది. రాష్ట్రంలో వరుసగా మహిళల పైన చిన్నారుల పైన ఇలాంటి అత్యాచార ఘటనలు జరగడంతో చాలామంది ప్రజలు కూడా కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. దీంతో హోంమినిస్టర్ కి కూడా రాబోయే రోజుల్లో ఇబ్బందులు తప్పవేమో అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.