అమెరికాలో ఎవరు గెలిస్తే.. ఇండియాకు లాభం ?
అయితే అమెరికా ఎన్నికల ఫలితాలు ఇండియా పైన కచ్చితంగా ప్రభావం చూపిస్తాయి. ట్రంప్ గెలిస్తే... ఇండియా పై కొంతమేర ప్రభావం ఉంటుంది. అటు కమల హారిస్ గెలిస్తే.. ఫలితాలు భిన్నంగా వస్తాయి. అయితే ఈ ఇద్దరిలో ఎవరు గెలిస్తే మన ఇండియాకు మేలు జరుగుతుందా అనే ప్రశ్న అందరిలోనూ తలెత్తుతోంది. ఇందులో ముఖ్యంగా ట్రంప్ గెలిస్తే మన ఇండియాకు ఎక్కువగా లాభం ఉందని కొంతమంది చెబుతున్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ కూడా అదే కోరుకుంటున్నారట. ట్రంపు అధ్యక్షుడు అయితే.. భారత వ్యవహారాలలో అమెరికా జోక్యం పూర్తిగా తగ్గిపోతుంది. మనకు శత్రువుగా ఉన్న చైనా పై ఉక్కు పాదం మోపెందుకు ట్రంప్ ప్రయత్నాలు చేస్తారు. అదే సమయంలో రష్యా మరియు ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితులను శాంతింప చేయడానికి ట్రంప్ ప్రయత్నాలు చేసే ఛాన్స్... ఉంటుంది. దానివల్ల ఇండియా తో పాటు చాలా దేశాలకు ఆర్థికంగా మేలు జరుగుతుంది. అయితే ట్రంప్ గెలిస్తే ఇండియా వస్తువులపై దిగుమతి శుంకం ఎక్కువగా పెంచే ప్రమాదం కూడా ఉంటుంది.
ఇక కమలా హారిస్ గెలిస్తే.. చాలా ఇబ్బందులు ఎదురవుతాయని అంటున్నారు. కమలా హారిస్ గెలిస్తే... కశ్మీర్ లాంటి ప్రాంతంలో వేలు పెట్టే ప్రమాదం ఉంటుందట. భారత అంతర్గత విషయాలలో జోక్యం చేసుకొని... మోడీ లాంటి వారిని ఇబ్బంది పెట్టె ఛాన్స్ ఉంటుంది. ఇప్పటికే చాలాసార్లు కాశ్మీర్ విధానం పైన... బైడెన్ చాలా సార్లు స్పందించారు. బిజెపికి వ్యతిరేకంగా ఆయన వ్యవహరించడం జరిగింది. అంతేకాకుండా కమలా హారిస్ గెలిస్తే చైనాకు కాస్త లాభం చేకూరుతుందట. అయితే కమలా హారిస్ గెలిస్తే... విశాల విషయంలో ఇండియాకు మేలు జరుగుతుందట. ఐటీరంగం కూడా ఇండియాలో అభివృద్ధి చేసేందుకు.. కమలా హారిస్ కృషి చేయనున్నారు.