మ‌హారాష్ట్ర ఎన్నిక‌లు.... ఏయే పార్టీలకు ఎన్ని సీట్లు... క‌ళ్లుతిరిగే లెక్క‌లు..!

RAMAKRISHNA S.S.
- ( ముంబై - ఇండియా హెరాల్డ్ ) . .
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తిగా మారాయి. ఇప్పుడు దేశం మొత్తం మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వైపు చూస్తోంది. ఇదిలా ఉంటే ఎన్నికల్లో తమ కూటమిలోని మూడు ప్రముఖ పార్టీలు తలా 85 అసెంబ్లీలో పోటీ చేస్తాయి అంటూ ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్ర విభాగం అధ్యక్షుడు పటోలే.. కాంగ్రెస్ నేషనల్ కాన్ఫ‌రెన్స్ పార్టీ - శివసేన ఒక్కటే 85 సీట్లలో పోటీ చేస్తాయని.. మరో 15 సీట్ల విషయంలో మూడు పార్టీలు ఇచ్చి పుచ్చుకుంటాయని.. మిగిలిన 18 సీట్లలో ఎస్పీతో సహా తమతో కలిసి వచ్చే చిన్న చిన్న పార్టీలకు ఇస్తున్నట్టు ఆయన ప్రకటించారు.

మహా ఘట్ బంధంలో సీట్లలెక్క ఏ రకంగా తేలుతుందని ఆసక్తి ఉంది. ఈ నేపథ్యంలో మూడు పార్టీలు సమాన స్థాయిలో సీట్లు పంచుకోవాలని ఒప్పందానికి రావడం విశేషం. గత ఎన్నికలలో కాంగ్రెస్ - ఎన్సిపి దాదాపుగా సమాన స్థాయిలో సీట్లు గెలిచాయి. చలో 40 స్థానాల్లో ఆ పార్టీలు గెలిచాయి. శివసేన వీటికన్నా ఎక్కువ ఎమ్మెల్యే సీట్లను నెగ్గింది. బిజెపితో కలిసి పొత్తుతో భాగంగా శివసేన అప్పుడు ఎక్కువ సీట్లు గెలుచుకుంది. అయితే ఇప్పుడు మూడు పార్టీలు సమాన స్థాయిలో సీట్లను పెంచుకున్నాయి.

సీట్ల‌లెక్క తేలిన‌ నేపథ్యంలో.. ఉద్ద‌శ్ థాక‌రే తన శివసేన తరఫున 65 సీట్లకు అభ్యర్థులను కూడా ప్రకటించారు. ఇక బిజెపి కూటమి తరపున ఆ పార్టీ ఏకంగా 150 కి పైగా సీట్లలో పోటీ చేయనుంది. శివసేన షిండే పక్షం 80 సీట్ల వరకు పొందుతూ ఉండగా.. ఎన్సీపీ అజిత్ పవర్ వర్గం 50 సీట్ల వరకు పోటీ చేస్తూ వస్తోంది. రెండు కూటములు, రెండు పార్టీల చీలిక ప‌క్షాల పార్టీలు .. రెండు వైపులా నిలుస్తున్న ఈ అసెంబ్లీ ఎన్నికల పోరు ఆసక్తి దాయకంగా సాగుతూ వస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: