మహావికాస్ అఘాడి VS మహాయుతి.. సీట్ల పంపకాలలో ట్విస్ట్ ?

Veldandi Saikiran
మహారాష్ట్ర ఎన్నికలకు కౌన్డౌన్ షురూ అయింది. మరో నెల రోజుల్లోనే ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. నవంబర్ 20వ తేదీన మహారాష్ట్రలో ఒకే దశలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ఆ రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు ఎన్నికల కోసం రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ముఖ్యంగా... మహారాష్ట్రలో... మరోసారి బాగా వేయాలని బిజెపి ప్రయత్నాలు చేస్తోంది.
 ఇందులో భాగంగానే అన్ని పార్టీలను కలుపుకొని ముందుకు వెళ్తోంది భారతీయ జనతా పార్టీ. ముఖ్యంగా మహారాష్ట్రలో మహా వికాస్ అగాడి, మహాయుతి కూటమిలు ఉన్నాయి.  మహారాష్ట్రలో ఈ రెండు కూటములు మాత్రమే.. బరిలో ఉండనున్నాయి. ముఖ్యంగా మహా వికాస్ అఘాడిలో... కాంగ్రెస్ పార్టీ, థాకరేకు సంబంధించిన శివసేన,  అలాగే శరత్ పవర్ ఎన్సిపి పార్టీలు ఇందులో ఉంటాయి.
 అటు మహాయుతి కూటమిలో మాత్రం భారతీయ జనతా పార్టీ, ఏక్నాథ్ షిండే శివసేన పార్టీ, అజిత్ పవర్ ఎన్సీపీలు ఉన్నాయి. అంటే శివసేన నుంచే... ఏక్ నాథ్ షిండే  విడిపోయారు. అటు శరత్ పవర్ నుంచి... అజిత్ పవర్ విడిపోయి ఎన్సిపి పేరుతోనే కొనసాగుతున్నారు. అయితే ఈ రెండు కూటమిల మధ్య... సీట్ల కేటాయింపు దాదాపు చివరి దశకు వచ్చింది. కాంగ్రెస్కు సంబంధించిన కూటమిలో... ఆ పార్టీకి ఎక్కువ సీట్లే కేటాయించారు.
 ఆ కూటమిలో కాంగ్రెస్ పార్టీకి... 105 నుంచి 110 స్థానాలు ఇవ్వబోతున్నారట. ఉద్దవ్ శివసేన పార్టీకి 85 నుంచి 90 స్థానాలు ఇస్తున్నారని సమాచారం. అలాగే శరత్ పవర్ ఎన్సిపి పార్టీకి 75 నుంచి 80 స్థానాలు వస్తాయట. అంటే ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీ.. ఎక్కువ సీట్లు తీసుకుంటుంది. ఇక బిజెపి కూటమిలో... భారతీయ జనతా పార్టీకి 152 నుంచి 155 స్థానాలు ఇవ్వబోతున్నారట. అలాగే ఏక్ నాథ్ షిండే పార్టీకి...దాదాపు.. 80 సీట్లు ఇవ్వబోతున్నారట. అజిత్ పవర్ ఎన్సిపి పార్టీకి 54 స్థానాలు ఇస్తున్నారని సమాచారం. మహారాష్ట్రలో మొత్తం 288 స్థానాలు ఉన్నాయి. మరి ఇందులో ఏ కూటమి అధికారంలోకి వస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: