నాలుగు నెలల్లో పవన్ చేసిన అభివృద్ధి ఇదే.. పవర్ స్టార్ ను మెచ్చుకోవాల్సిందే!

Reddy P Rajasekhar
జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే కీలక నిర్ణయాలు తీసుకోవడం ద్వారా వార్తల్లో నిలిచారు. గత కొన్నేళ్లుగా విద్యుత్ సౌకర్యం లేని నాగులపల్లి జెడ్ పీ హెచ్ హైస్కూల్ కు పవన్ విద్యుత్ సౌకర్యం వచ్చేలా చేశారు. గొల్లప్రోలు మహిళా జూనియర్ కాలేజ్ స్టూడెంట్స్ కు కంప్యూటర్లు అందే విధంగా చేశారు.
 
గత కొన్నేళ్లుగా తాగునీటి సౌకర్యం లేని గొల్లప్రోలు బాలుర ప్రాథమికోన్నత పాఠశాలకు మంచినీటి సౌకర్యం అందించారు. రాజమండ్రి కాకినాడ మధ్య రహదారి విస్తరణ పనులు కొనసాగేలా చేశారు. గుడివాడలోని కంకిపాడులో ప్రత్యేక బృందం సహాయంతో కలుషిత నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపారు. గొల్లప్రోలు డంపింగ్ యార్డ్ కు సైతం శాశ్వత పరిష్కారం కోసం కృషి చేసి పవన్ సక్సెస్ అయ్యారు.
 
గొల్లప్రోలు డివిజన్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో పవన్ కళ్యాణ్ అవసరమైన నర్సింగ్ సిబ్బందిని నియమించడం జరిగింది. విజయనగరంలోని శాసనాలపల్లి ఫ్లై ఓవర్ బ్రిడ్జ్ ఎస్టిమేషన్ పనులను ప్రోగ్రెస్ లో ఉంచారు. ఈ నాలుగు నెలలు లో పవన్ కళ్యాణ్ గారు చేసిన మంచి పనులు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.
 
జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీడియాకు దూరంగా ఉంటూనే తన వంతు మంచి పనులను చేయడం ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు. ఈ విషయంలో పవన్ ను ఎంత మెచ్చుకున్నా తక్కువేనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ రాబోయే రోజుల్లో జనసేనను మరింత బలోపేతం చేయాలని అభిమానులు కామెంట్లు చేస్తుండటం గమనార్హం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలో సినిమా షూటింగ్ లతో బిజీ కానుండగా పవన్ సినిమాలు వేగంగా పూర్తి కావాలని అభిమానులు కోరుకుంటున్నారు. పవన్ సినిమాల బిజినెస్ లెక్కలు సైతం మారిపోయాయని సమాచారం అందుతోంది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: