తెలంగాణ ఎమ్మెల్యేకు .. అర్ధరాత్రి మహిళా న్యూడ్ కాల్..?
తెలంగాణ రాష్ట్రంలోని ఓ ప్రముఖ రాజకీయ పార్టీకి చెందిన ఎమ్మెల్యేకు... న్యూడ్ కాల్ వచ్చిందట. ఇప్పుడు ఈ విషయం రెండు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ అయింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన.. ఓ పార్టీ ఎమ్మెల్యేకు... వీడియో కాల్ వచ్చిందట. వెంటనే ఆ వీడియో కాల్... లిఫ్ట్ చేశాడట సదరు ఎమ్మెల్యే. అర్ధరాత్రి కావడంతో... ఫోన్ చేసిన మహిళ.. న్యూడ్ గా కనిపించిందట. ఇక ఆ మహిళను చూసిన సదరు ఎమ్మెల్యే.... ఒకసారిగా ఆందోళనకు గురయ్యాడట.
వెంటనే ఆ ఫోన్ కాల్ కట్ చేశాడట ఎమ్మెల్యే. ఈ సంఘటన అక్టోబర్ 14వ తేదీన అంటే నాలుగు రోజుల కిందట జరిగింది. తాజాగా ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. అయితే ఈ సంఘటన జరిగిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడట ఆ కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు... దర్యాప్తు చేస్తున్నారు.
అయితే ఈ సంఘటనపై... సదరు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే...వింతగా వ్యవహరిస్తున్నారు. తన ప్రత్యర్థి పార్టీ నేతలు.. ఓ మహిళతో ఇలా చేయిస్తున్నారని... సంచలన ఆరోపణలు చేశారు. తనను రాజకీయంగా ఎదుర్కోలేక... ఇలా మహిళలతో దారుణాలకు ఒడిగడుతున్నారని ఆ ఎమ్మెల్యే ఫైర్ అవుతున్నారు. అయితే బాధిత ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి చెందిన వాడని చెబుతున్నారు. ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది. దీని పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.