డబ్బుని లెక్క చేయని గొప్ప వ్యక్తిత్వం.. కుక్క కోసం రాజు ఆహ్వానాన్ని పక్కన పెట్టిన రతన్ టాటా?

praveen
టాటా గ్రూప్ కంపెనీకి చాలా కాలం పాటు ఛైర్మన్‌గా ఉన్న రతన్ టాటా బుధవారం రాత్రి మరణించారు. రతన్ టాటా బతికున్నంత కాలం ఇండియాకు పేద ప్రజలకు సమాజానికి జంతువులకు ఎంతో మంచి చేశారు. ఆయన చేసిన అన్ని మంచి పనులు తెలుసుకుంటే అలాంటి ఒక పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ ఎవరూ ఉండరేమో అనే ఫీలింగ్ కలుగుతుంది. రతన్‌కు జంతువులంటే చాలా ఇష్టం, ముఖ్యంగా కుక్కలంటే ఎంతో ప్రేమ. ఆయన పనిచేసే టాటా గ్రూప్ ఆఫీసులోకి కూడా వీధి కుక్కలను అనుమతించేవారు, వాటికి ఆశ్రయం తో పాటు ఫుడ్ కూడా పెట్టేవారు.
ఒకసారి రతన్ టాటాకు చాలా గొప్ప అవార్డు ఇవ్వాలని నిర్ణయించారు. ఆ అవార్డును ఇంగ్లాండ్ దేశానికి చెందిన ప్రిన్స్ చార్లెస్ ఇవ్వాలనుకున్నారు. కానీ ఆ సమయంలో రతన్ టాటా పెంపుడు కుక్క అనారోగ్యంతో ఉంది. అందుకే ఆ అవార్డు తీసుకోవడానికి వెళ్లకుండా, తన కుక్క దగ్గరే ఉండిపోయారు. అంటే, తన కుక్కను చూసుకోవడమే ముఖ్యమని భావించారు.
అసలు వివరాల్లోకి వెళ్తే, 2018 ఫిబ్రవరి 6న, బ్రిటన్ దేశంలోని బకింగ్‌హామ్ ప్యాలెస్‌ ప్రిన్స్ చార్లెస్ రతన్ టాటా గారికి ఒక ప్రత్యేకమైన అవార్డు ఇవ్వాలని నిర్ణయించారు. ఆ అవార్డు పేరు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు. ఎందుకంటే రతన్ టాటా చాలా మంచి పనులు చేశారు. ఈ కార్యక్రమాన్ని బ్రిటిష్ ఆసియన్ ట్రస్ట్ అనే సంస్థ ఏర్పాటు చేసింది. అవార్డు అందించే ఆయన చేసిన మంచి పనులను అభినందించాలని ప్రిన్స్ చార్లెస్ భావించారు.
ఈ కార్యక్రమానికి హాజరు కావడానికి సుహేల్ సేత్ అనే వ్యక్తి ఫిబ్రవరి 2 లేదా 3 తేదీల్లో లండన్‌కు వెళ్లారు. ఆ సమయంలో రతన్ టాటా సుహేల్ సేత్‌కు 11 ఫోన్ కాల్స్ చేశారు. అంటే, రతన్ టాటా గారు సుహేల్ సేత్‌తో చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలనుకున్నారు. ఈ అవార్డు కార్యక్రమంలో హాజరుకావడానికి సుహేల్ సేత్ బయలుదేరారు. లండన్ విమానాశ్రయంలో తన సామాను తీసుకుంటున్న సమయంలో రతన్ టాటా ఆయనకు ఫోన్ చేసి తన టిటో కుక్క అనారోగ్యంగా ఉందని చెప్పారు. "నేను దానిని వదిలి వెళ్లలేను" అని కూడా స్పష్టం చేశారు. అదే విషయాన్ని ప్రిన్స్ చార్లెస్ కి తెలియజేయాలని కోరారు. అలా ఆ అవార్డు కార్యక్రమానికి హాజరు కావడానికి వెళ్లకుండా, తన కుక్క దగ్గరే ఉండిపోయారు.
ఈ విషయం తెలిసి ప్రిన్స్ చార్లెస్ చాలా సంతోషించారు. ఆయన రతన్ టాటాని గొప్పగా అభినందించారు. "అదే ఒక నిజమైన మనిషి అంటే. రతన్ అంటే అదే. అందుకే టాటా కుటుంబం ఎంతో గౌరవం పొందుతుంది. అందుకే అది చాలా స్థిరంగా ఉంది" అని ప్రిన్స్ చార్లెస్ పొగడ్తల వర్షం కురిపించారు. కావాలంటే కుక్కని ఆయన అసిస్టెంట్ లో చూసుకోగలరు. ప్రిన్స్ చార్లెస్ అందించే అవార్డు వస్తుందంటే వెంటనే వెళ్ళిపోయి తీసుకునే వారిలో చాలామంది ఉంటారు కానీ రతన్ టాటా తన కుక్క కోసం దాన్ని కూడా వద్దన్నారు. అనారోగ్యంతో ఉన్న తన కుక్క పక్కన ఉండటం తన బాధ్యత అని దాంతో పాటే ఉండిపోయారు. దాని పట్ల అంత గౌరవం, కేర్ చూపించారంటే రతన్ టాటా ఎంత గొప్పవారో అర్థం చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: