ప‌ల్నాడు జిల్లాలో ఇద్ద‌రు ' కొలికిపూడి ' లాంటి నేత‌లు... చంద్ర‌బాబు చూస్తున్నారా...?

RAMAKRISHNA S.S.
- నియోజ‌క‌వ‌ర్గాన్ని కొడుకుల‌కు వాటాలేసి పంచిన సీనియ‌ర్ నేత‌..!
- కొత్త‌గా గెలిచిన నేత కూడా వ‌సూళ్ల రాజానేనా..?
- పార్టీ కోసం క‌ష్ట‌ప‌డ్డ కేడ‌ర్‌నే వేధిస్తోన్న వైనం..?

(ప‌ల్నాడు - ఇండియా హెరాల్డ్ )

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కూట‌మి ప్ర‌భుత్వంలో ప్ర‌జాప్ర‌తినిధులు అప్పుడే దందాల‌కు తెర‌లేపేస్తున్నారు. మ‌రి కొంద‌రు ఓవ‌ర్ యాక్ష‌న్‌తో ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెడుతున్నారు. ఇప్ప‌టికే రాష్ట్ర వ్యాప్తంగా ఓ 10 మంది ప్ర‌జాప్ర‌తినిధులు దారుణ దందాలు మొద‌లు పెట్ట‌గా... పాల‌న 100 రోజులు దాటిందో లేదో ఇప్పుడు సీనియ‌ర్లు కూడా త‌మ‌త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో దందాలు.. చందాలు.. అక్ర‌మ వ‌సూళ్లు. అవినీతికి తెర‌లేపేస్తున్నారు. వీరితో ప్ర‌భుత్వానికి చాలా చెడ్డ‌పేరు వ‌చ్చేలా ఉంది. ఎక్క‌డో గుంటూరు జిల్లాలో సీటు లేక ఉన్న కొలిక‌పూడి శ్రీనివాస‌రావును చంద్ర‌బాబు ప‌నిక‌ట్టుకుని ఎన్టీఆర్ జిల్లా తిరువూరుకు తీసుకువెళ్లి సీటిచ్చి.. బాబే స్వ‌యంగా డ‌బ్బు ఖ‌ర్చు పెట్టించి గెలిపిస్తే ఆయ‌న పార్టీ అధిష్టానాన్ని ముప్పుతిప్ప‌లు పెడుతూ మూడుచెరువుల నీళ్లు తాగిస్తున్నారు. ఇక్క‌డ కొలిక‌పూడిని పార్టీ అధిష్టానం అస్స‌లు కంట్రోల్ చేయ‌లేక‌పోతుండ‌డంతో పాటు చేతులు ఎత్తేస్తుండ‌డం.. పైగా టీడీపీ అనుకూల మీడియా ప్ర‌తినిధులు స్వ‌యంగా వెళ్లి చంద్ర‌బాబును క‌ల‌వ‌డం ఇవ‌న్నీ కూట‌మి ప్ర‌భుత్వానికే మైన‌స్‌గా మారాయి.

ఇదిలా ఉంటే ఇప్పుడు ప‌ల్నాడు జిల్లాలో కూడా తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్ద‌రు ప్ర‌జాప్ర‌తినిధులు కొలిక‌పూడిని మించిపోయారు. వీళ్ల‌ది మ‌రో దందా... అవినీతి, అక్ర‌మాల‌తో బాగా లాగేస్తున్నారు. ఒక‌ప్పుడు రాజ‌కీయంగా ఉమ్మ‌డి రాష్ట్రంలో ఓ వెలుగు వెలిగి ఆ త‌ర్వాత ప‌లు పార్టీలు మారి టీడీపీలోకి వ‌చ్చిన ఓ నేత ఇక్క‌డ గెలిచారు. అది టీడీపీకి మంచి ప‌ట్టున్న సీటు.. అక్క‌డ చాలా మంది పార్టీ ఆవిర్భ‌వించిన‌ప్ప‌టి నుంచి ఉన్న వారు సీటు ఆశించినా వారిని కాద‌ని మ‌రీ బాబు ఆ సీనియ‌ర్ నేత‌కు సీటు ఇచ్చారు. మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌ని క‌ల‌లు క‌న్నారు.. రాలేదు. ఇప్పుడు నియోజ‌క‌వ‌ర్గంలో భారీ అవినీతి, దందాల‌కు తెర‌లేపేశారు.

ఈ క్ర‌మంలోనే పార్టీ కోసం ఎప్పటినుంచో పనిచేస్తూ ఆస్తులు అమ్ముకొని గత ఎన్నికలలో ఆయ‌న‌ గెలుపు కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసిన వారిపై ఏదో ఒక నింద వేయటం వారిని పక్కన పెట్టేయడం జరుగుతుంది. పార్టీ కోసం కమిట్మెంట్తో పనిచేసిన నాయకుడు అంటే చాలు ఆయనకు అస్సలు పడటం లేదు.. ఏదో ఒక పదవి అడుగుతాడు.. పైగా పార్టీలో సీనియ‌ర్ అని క‌ప్పం క‌ట్ట‌డు అన్న నెపంతో నింద వేసి పక్కన పెట్టేస్తున్నారు. ఇక త‌న‌ ఇద్దరు కుమారులకు నియోజకవర్గాన్ని మండలాలు.. మున్సిపాలిటీ వారీగా పంచేసి.. మరి వసూలు చేసుకోమని పంపినట్టుగా వాతావరణం కనిపిస్తుంది. తండ్రి అధికారం అడ్డం పెట్టుకుని ఇద్ద‌రు వార‌సులు భారీ అవినీతికి పాల్ప‌డుతున్నారు.

ప‌వ‌న్ క‌ళ్యాన్‌, చంద్ర‌బాబు ఇమేజ్‌తో తాను గెల‌వ‌లేద‌ని.. త‌న సొంత ఇమేజ్‌తో గెలిచాన‌ని కూడా స‌ద‌రు నేత చెప్పుకుంటున్నారు. అదే నిజ‌మైతే గ‌తంలో పోటీ చేసిన‌ప్పుడు క‌నీసం డిపాజిట్ కూడా ఎందుకు తెచ్చుకోలేక‌పోయావ‌ని పార్టీ కేడ‌ర్ నుంచి ఆయ‌న‌కు సూటి ప్ర‌శ్న‌లు ఎదుర‌వుతున్నాయి. కొంద‌రు మ‌హిళా కార్య‌క‌ర్త‌ల ప‌ట్ల కూడా దురుస‌గా ప్ర‌వ‌ర్తిస్తూ మీరు నాకేమైనా ఉచితంగా ఓట్లేశారా.. ఒక్కొక్క‌రికి రు. 2 వేలు ఇచ్చాను క‌దా ? అని ఫైర్ అవుతుండ‌డంతో వారు సైతం తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

ఇక నియోజ‌క‌వ‌ర్గంలో ఒక్కో వైన్ షాపు రేటు రు. 40 లక్షలుగా చెబుతున్నారు. అది కూడా వైసిపి వాళ్లు ఎక్కువ డబ్బులు ఇస్తామని వస్తే వాళ్లకే కట్టబెడుతున్నారు. ఈ విషయంలో అస్సలు రాజీపడటం లేదు..నియోజకవర్గంలో బార్‌లు మొత్తం వైసిపి వాళ్ళకి కట్టబెడుతున్నారు. వైసీపీకి చెందిన ఓ మండల స్థాయి నాయకుడితో చేతులు కలిపి క్వార్జ్‌ మైనింగ్ దందా నడిపిస్తూ భారీగా వెన‌కేసుకుంటున్నారు. పల్నాడు జిల్లా పరిధిలోని పార్టీ మారి వచ్చి తెలుగుదేశం ప్ర‌జాప్ర‌తినిధిగా గెలిచిన వ్యక్తి ఆ పాత వాసనలతోనే ఇంకా రాజకీయం చేస్తున్నాడు మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీతో కలవడం లేదు అన్న విమర్శలు వస్తున్నాయి.

మ‌రో ప్ర‌జాప్ర‌తినిధిది అదే దారి...
ఇక ఇదే ప‌ల్నాడు జిల్లాకు చెందిన మ‌రో తెలుగుదేశం ప్ర‌జాప్ర‌తినిధి కూడా ఫ‌స్ట్ టైం గెలిచాడు. ఆయ‌న‌కు సీటు ఇవ్వ‌కూడ‌ద‌ని చంద్ర‌బాబు అనుకున్నా చివ‌ర్లో గ‌త్యంత‌రం లేక ఇచ్చారు. ఆయ‌న కూడా గెలిచారో లేదో నియోజ‌క‌వ‌ర్గంలో దందాలు... చందాల రాజ‌కీయం మొద‌లు పెట్టేశారు. నియోజ‌క‌వ‌ర్గంలో చిన్న చిన్న ప‌నుల‌కు సైతం వాటాలు ఇవ్వాల్సిందే అని కండీష‌న్లు పెట్టి మ‌రీ కుమ్ముకుంటున్నార‌ట‌. స‌ద‌రు ప్ర‌జాప్ర‌తినిధి తీరుతో నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ కేడ‌ర్ గ‌గ్గోలు పెడుతోంది. చాలా యేళ్ల త‌ర్వాత అక్క‌డ పార్టీ గెలిచింద‌న్న ఆనందం కూడా కేడ‌ర్‌కు లేద‌ట‌. ఏదేమైనా ఇలాంటి నేత‌ల విష‌యంలో కంట్రోల్ లేక‌పోతే పార్టీ.. ప్ర‌భుత్వం ప‌రువు బ‌జారున ప‌డ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: