పవన్‌ కళ్యాణ్‌ సీటుకు వర్మ ఎసరు..ఏకంగా 12 మందితో ?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో.. కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత... జనసేన పార్టీలో కొంత అసంతృప్తి స్పష్టంగా కనిపించింది. కీలక పదవులన్నీ చంద్రబాబు పార్టీకి... చెందాయని జనసేన నేతలు ఇప్పటికి ఆరోపణలు చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలు బహిరంగంగా చేయకపోయినా... అంతర్గత సమావేశాల్లో మాట్లాడుకుంటున్నారు జనసేన నేతలు.
అయితే ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గం లో... మాజీ ఎమ్మెల్యే వర్మ వర్సెస్ జనసేన నాయకుల మధ్య వివాదం...  రోజు రోజుకు రాజ్ కుంటోంది. పిఠాపురం వర్మాను ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ ఆడుకుంటున్నారు జనసేన నేతలు. పవన్ కళ్యాణ్ విజయం కోసం ఎంతో కష్టపడ్డా... వర్మాను.. టార్గెట్ చేసి మరి.. ఇబ్బందులు పెడుతున్నారు. దీనికి సంబంధించిన అంశం ప్రతిసారి చంద్రబాబు వద్దకు వెళ్తోంది. అయినప్పటికీ ఈ వివాదానికి పులిస్టాప్ పడడం లేదు.
ఇలాంటి నేపథ్యంలో తెరపైకి మరో వివాదం వచ్చింది. కాకినాడ పిఠాపురం అర్బన్ క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీ ఎన్నికల్లో ఒకరిపై ఒకరు పోటీకి టిడిపి, జనసేన  దిగుతున్నారు. ఐదుగురు డైరెక్టర్ పదవులకు ఎన్నికలు జరగుతున్నాయి. అయితే.. ఎవరికి వారు అభ్యర్థులను నిలబెట్టారు జనసేన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, టిడిపి మాజీ ఎమ్మెల్యే వర్మ.  ఐదు డైరెక్టర్ పోస్టులకు బరిలో ఉన్న 12 మంది అభ్యర్థులు ఉన్నారు.
కలిసి ఏకగ్రీవం చేసుకోవలసిన డైరెక్టర్ పదవులకు...జనసేన, టిడిపి  పోటీపడుతున్నాయి.  అటు పోటీకి దూరంగా ఉన్న వైసిపి..టీడీపీ, జనసేన వార్‌ కళ్లారా చూస్తోంది.  18 మంది నామినేషన్ వేస్తే ఆరుగురు విత్ డ్రా చేసుకోగా..., పోటీలో ఉన్న 12 మంది అభ్యర్థులు ఉన్నారు.  ఇప్పటికే అభ్యర్థులకు గుర్తులు కేటాయించారు.  వచ్చే నెల 6న ఎన్నికలు జరగనున్నాయి.  దీంతో ఎవరు గెలుస్తారో చూడాలని ఎంతో ఆతృతగా పిఠాపురం ప్రజలు ఉన్నారు. దీనిపై పవన్‌ కళ్యాణ్‌ కూడా ఆతృతగా చూస్తున్నట్లు సమాచారం.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: