ఏపీ సిఎం: ఉచిత గ్యాస్ సిలిండర్ కు గ్రీన్ సిగ్నల్.. వారే అర్హులు..!

Divya
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం తాజాగా ఎన్నికల్లో ఇచ్చిన హామీని మరొకటి నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నది.. ఎన్నికల ముందు సూపర్ సిక్స్ హామీలను సరిత ఇవ్వడంతో ప్రజలు కూటమికి అధికారాన్ని కట్టబెట్టారు. కేవలం ఇప్పటివరకు 4000 రూపాయలు పెన్షన్ ని పెంచడం తప్ప మరే పథకాన్ని అమలు చేయలేదు.. ఇలాంటి సమయంలో ప్రభుత్వం మీద వ్యతిరేకత రావడంతో ఇప్పుడు దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేసేలా మార్గదర్శకాలు సిద్ధమయ్యాయి అనే విధంగా తెలుస్తోంది.

సూపర్ సిక్స్ హామీలలో భాగంగా ప్రతి ఏడాది కూడా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను ఇస్తామని చంద్రబాబు తెలియజేశారు. ఈ పథకానికి సంబంధించి పౌరసరప్రాల శాఖ తెలియజేస్తూ రాష్ట్రంలో 1.55 కోట్ల వంట గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయని ఇందులో తెల్ల రేషన్ కార్డు ఉన్నవారు ఈ పథకానికి అర్హులని అనుకుంటే సుమారుగా 3,640 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని తెలిపారు.. దీపం, ఉజ్వల వంటి పథకాల కింద కనెక్షన్ తీసుకున్నవారు 75 లక్షల మంది ఉన్నారని ఒకవేళ ఈ పథకాలకు ఒకటి అమలు చేస్తే ..1,763 కోట్లు రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారట.

ఇటీవలే మంత్రుల కమిటీ సమావేశమైన ఏపీ ప్రభుత్వం ఎన్నికల హామీలను ప్రతి ఇంటికి మూడు ఉచిత సిలిండర్లు ఇస్తామంటూ వెల్లడించామని కచ్చితంగా వీటిని అమలు చేయాలని ప్రస్తుతం రాష్ట్రంలో ఒక్కో సిలిండర్ ద్వారా 825 ఉందని.. ఈ పథకాన్ని తెల్ల కార్డు ఉన్నవారికి అమలు చేస్తే 1.47 కోట్ల మంది కుటుంబాలు అర్హతలు ఉన్నాయని.. ఉజ్వల కింద సిలిండర్ కు 300 చొప్పున రాయితీ ఇస్తే కాస్త భారం తగ్గుతుందని సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారట.9.70 లక్షల ఉజ్వల గ్యాస్ సిలిండర్లు కేంద్రం ఇచ్చిందని ఇందులో భాగంగా ఒక్కో సిలిండర్ కి 300 రూపాయల చొప్పున ఏడాదికి 12 సిలిండర్ల రాయితీ ఇస్తోందంటూ తెలిపారు. ఇప్పుడు ఏపీలో ఉన్న వాటన్నిటినీ కూడా అలాగే తీసుకోవాలని లేఖ రాశారట ఏపీ సీఎం. అయితే కేంద్రం ఇప్పటివరకు ఈ విషయం పైన స్పందించలేదట.. వచ్చేవారం నుంచే ఉచిత గ్యాస్ సిలిండర్ కు మార్గదర్శకాలు విడుదల చేయబోతోంది కూటమి ప్రభుత్వం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: