కాలినడకన జగన్...అసలు తిరుమల డిక్లరేషన్ అంటే ఏంటి ?
అయితే.. ఈ లడ్డు వివాదం నేపథ్యంలో ప్రతి ఒక్కరు జగన్మోహన్ రెడ్డిని తిడుతూనే ఉన్నారు. హిందూ సంస్థలు, బిజెపి నేతలు కూడా మండిపడుతున్నారు. అయితే వీటన్నిటికీ చెక్ పెట్టి ఎందుకు... తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. స్వయంగా తానే తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని... డిసైడ్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి.
అంతేకాదు తిరుమల శ్రీవారి వద్దకు కాలినడకన.. అలిపిరి మార్గంలో వెళ్లాలని వైయస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంతో ఈ విషయం మళ్లీ హాట్ టాపిక్ అయింది. నిజంగానే జగన్మోహన్ రెడ్డి కాలినడకన తిరుమల శ్రీవారిని దర్శించుకుంటే... మళ్లీ హీరో అయిపోతారు. అయితే జగన్మోహన్ రెడ్డిని మళ్లీ తొక్కేందుకు.. కూటమి పార్టీలు కొత్త ఎత్తుగడ వేసినట్లు వైసిపి నేతలు చెబుతున్నారు. తిరుమల డిక్లరేషన్ పైన సంతకం చేయాలని.. ఆ తర్వాతే తిరుమలకు వైయస్ జగన్ వెళ్లాలని ఈ కూటమి పార్టీ నేతలు డిమాండ్ చేయడం జరుగుతుంది.