కర్ణాటక, తెలంగాణ ముఖ్యమంత్రుల రాజీనామా?

Veldandi Saikiran

ప్రస్తుతం దేశవ్యాప్తంగా తిరుమల శ్రీవారి లడ్డు చుట్టూ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో...  కాంగ్రెస్ పార్టీకి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. కాంగ్రెస్ పార్టీ ఇటీవల అధికారంలోకి వచ్చిన కర్ణాటక అలాగే తెలంగాణ రాష్ట్రాలలో..  స్వయంగా ముఖ్యమంత్రిలే కోర్టు చుట్టూ తిరిగే   పరిస్థితి నెలకొంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో.. ఇరుక్కోగా... కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాత్రం.. మూడా స్కాంలో  అడ్డంగా దొరికిపోయారు.
 ఇక్కడ విషయం ఏంటంటే మంగళవారం రోజునే.. సీఎం రేవంత్ రెడ్డి అలాగే సిద్ధరామయ్య లకు కోర్టు నుంచి కీలక ఆదేశాలు వచ్చాయి. తెలంగాణ రాష్ట్రంలో.. ఓటుకు నోటు కేసు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నాంపల్లి కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గత తొమ్మిది నెలలుగా ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి కోర్టుకు రావడంలేదని...  కేవలం తన తరఫు లాయర్ ను మాత్రమే పంపిస్తున్నాడని సీరియస్ అయింది.

అలాగే ఈ కేసును వేగంగా విచారణ చేస్తున్నట్లు కూడా ప్రకటించింది. ముఖ్యంగా ఈ కేసును అక్టోబర్ 16వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది నాంపల్లి కోర్టు. ఆ రోజున ముఖ్యమంత్రితో పాటు ఈ కేసులో ఉన్న వారందరూ ఖచ్చితంగా కోర్టుకు హాజరు కావాలని తెలిపింది. లేకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఇక అటు కర్ణాటకలో కూడా... అక్కడి హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది.
 

మూడా స్కామ్ లో...  సీఎం సిద్ధరామయ్యను కచ్చితంగా అధికారులు విచారించాల్సిందేనని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది కర్ణాటక హైకోర్టు. తనను విచారించకూడదని సిద్ధరామయ్య పిటిషన్ వేశారు. అయితే ఆ పిటిషన్ను కొట్టివేస్తూ... సిద్ధరామయ్యను విచారించాల్సిందేనని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది.  దీంతో గవర్నర్ కూడా... సిద్ధరామయ్యను విచారించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.  దీంతో ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు కొత్త వివాదంలో చిక్కుకున్నారు. ఇలాంటి నేపథ్యంలోనే ఇద్దరు ముఖ్యమంత్రులను... కాంగ్రెస్ అధిష్టానం మార్చబోతుందని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. మరి దీనిపై కాంగ్రెస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: