వైసీపీ ఎమ్మెల్యేగా ఓడాడు... టీడీపీలోకి దూకేస్తున్నాడు..?

RAMAKRISHNA S.S.
ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికలలో విశాఖపట్నం నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన వైసీపీ నేత ఇప్పుడు టిడిపి వైపు చూస్తున్నారు. వైసీపీ తరఫున విశాఖపట్నం నుంచి పోటీ చేసి భారీ ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు అడారి ఆనంద్ కుమార్ .. ఇప్పుడు ఆయన సైకిల్ ఎక్కేందుకు సిద్ధమవుతున్నారు అన్న ప్రచారం సాగుతోంది. అయితే తెలుగుదేశం పార్టీ నుంచి ఆయనకు గ్రీన్ సిగ్నల్ వచ్చిందా లేదా అన్నదే సస్పెన్స్ గా మారింది అడారి ఆనంద్ కుమార్ విశాఖ డైరీ చైర్మన్ గా ఉన్నారు. ఆయన 2019 ఎన్నికలలో అనకాపల్లి నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం ఆమె సోదరీ తో పాటు ఆయన కూడా వైసిపి కండువా కప్పుకున్నారు.

ఇప్పుడు వైసీపీ ఓడిపోవడంతో తిరిగి టిడిపి వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది. విశాఖ డైరీ నుంచి సింహాచలం దేవస్థానానికి నెయ్యి సరిపడా చేసేలా ఆయన తాత్కాలిక‌ కాంట్రాక్టు పొందినట్టు తెలుస్తోంది. ఇప్పటిదాకా ఇది వేరే సంస్థ సరఫరా చేస్తుంది. అయితే శ్రీవారి లడ్డు ప్రసాదంలో వాడిన నెయ్యలో కల్తీ జరిగింది అన్న ఆరోపణల నేపథ్యంలో ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు సింహాచలం దేవస్థానంలోనూ ప్రస్తుతం వాడుతున్న నెయ్యి సీజ్ చేశారు. దీంతో దయనందన వ్యవహారాలు సాగేందుకు వీలుగా విశాఖ డైరీ నుంచి టెంపరరీ పద్ధతిలో నెయ్యి సరిపడా కాంట్రాక్టుని ఆనంద్ కుమార్ అందుకున్నారు.

దీంతో అడారి ఆనంద్ కుమార్ కు టిడిపిలో చేరేందుకు లైన్ క్లియర్ అయింది అన్న ప్రచారం నడుస్తోంది. టిడిపితో గత కొన్నిళ్ళుగా తెగిపోయిన ఈ బంధం ఇప్పుడు నెయ్యి రూపంలో కొత్తగా మారుతోందని అంటున్నారు. దీని వెనక ఒక మాజీ మంత్రి చక్రం తిప్పారని అంటున్నారు. అడారి ఆనంద్ తండ్రి తులసిరావు టిడిపిలో ఉంటూ వచ్చారు. ఆనంద్ కుమార్ 2019లో అనకాపల్లి నుంచి ఎంపీగా టిడిపి తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత వైసిపి లో చేరిన ఈ కుటుంబం ఇప్పుడు తిరిగి మాతృ సంస్థ వైపు అడుగులు వేస్తున్నట్టుగా విశాఖ జిల్లా రాజకీయ వర్గాలలో జోరుగా ప్రచారం నడుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

YCP

సంబంధిత వార్తలు: