వైసీపీలో నెక్ట్స్ వికెట్లు ఇవేనా... ప‌క్కా రాసుకోవ‌చ్చు..?

RAMAKRISHNA S.S.
వైసీపీని సీనియర్లు వరుసగా వీడుతున్నారు. వరుసగా పార్టీకి రాజీనామాలు చేస్తున్నారు. ఇప్పటికే కిలారు వెంకట రోశయ్య, ఆళ్ళ నాని, మద్దాలి గిరిధర్ రావు లాంటి నేతలు బయటకు వచ్చేసారు. ఇక బాలినేని శ్రీనివాస్ రెడ్డి, సామినేని ఉదయభాను కూడా వైసీపీని వీడి జనసేనలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు మరికొందరు కీలక నేతలు కూడా.. పార్టీ వీడి బయటికి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. చివరకు జగన్‌కు అత్యంత సన్నిహితులైన ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కూడా పార్టీ మారుతున్నట్టు గట్టిగా ప్రచారం జరిగింది.

అయితే దానిపై ఆయన క్లారిటీ ఇస్తూ తను రాజకీయాల్లో ఉన్నంతకాలం వైయస్ ఫ్యామిలీతోనే ఉంటానని.. జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తానని చెప్పారు. ఇప్పటికే వైసీపీ 11 సీట్లకే పరిమితం అయింది. పార్టీలో జరుగుతున్న అంతర్గత పరిణామాల కారణంగా చాలామంది బయటకు వచ్చేయాలని నిర్ణయాలు తీసుకున్నారు. అసలు పార్టీలో కాపు నేతలు మాత్రం జనసేన వైపు చూస్తున్నారు. గోదావరి జిల్లాలకు చెందిన వైసీపీ మాజీ మంత్రులు ఎన్డీఏ కూట‌మి వైపు చూస్తున్నారు. ఇప్పటికే పలువురు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కూడా టిడిపి, జనసేనలో చేరిపోతున్నారు.

రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్‌రావు సైతం ఎప్పటికి పార్టీ మారారు. ఇక తాజా జాబితాలో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సీనియర్ నేత ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయను జనసేనకు తీసుకువెళ్లేందుకు.. ఆయన వియ్యంకుడు ఆయిన సామినేని ఉదయభాను తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌తో పాటు గతంలో అత్తిలి, మొన్నటి వరకు ఆచంట ఎమ్మెల్యేగా ఉన్న మాజీమంత్రి చెరుకువాడ రంగనాథరాజు సైతం పార్టీని వీడుతున్నారని ప్రచారం జరుగుతోంది.

వీరు మాత్రమే కాదు ఉమ్మడి విశాఖ జిల్లాతో పాటు.. ఉత్తరాంధ్రలోని విజయనగరం, శ్రీకాకుళం జిల్లాకు చెందిన కీలక నేతలు సైతం వైసీపీ నుమ‌చి బయటకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: