ఏపీ: తాలిబన్ల కంటే కిరాతకులు.. 400 ఏళ్ల నాటి రాముడి శిరస్సును ఖండించారు..?
* 400 ఏళ్ల నాటి రాముడి శిరస్సునే ఖండించారు
* తాలిబన్ల కంటే కిరాతకులు మారారు
( ఏపీ - ఇండియా హెరాల్డ్)
ఆంధ్రప్రదేశ్‌లో దేవుళ్లు, దేవాలయాల చుట్టూ రాజకీయం నడుస్తోంది. ప్రపంచ ప్రఖ్యాత దేవస్థానమైన తిరుమల తిరుపతి దేవస్థానానికి కూడా మచ్చ అనేది వచ్చింది. ఇక్కడ లడ్డూలలో యానిమల్ ఫ్యాట్ కలుపుతున్నారని వార్తలు రావడంతో చాలామంది శాఖాహారులు అక్కడికి రావడమే మానేస్తున్నారు. నిజానికి బాలాజీ టెంపుల్ ఒక్కటే కాదు ఏపీలో ఇలాంటి చాలా టెంపుల్ కాంట్రవర్సీల్లో చిక్కుకున్నాయి.
2021లో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో విజయనగరం రామతీర్థం ఆలయంలో 400 ఏళ్ల నాటి రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది. ఆ టైమ్‌లో సర్వత్రా నిరసనలు వ్యక్తమయ్యాయి. సీఎం జగన్ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. అప్పట్లో అయోధ్యలో రామమందిరాన్ని నిర్మిస్తుండగా శ్రీరాముడి విగ్రహంపై దాడి జరిగింది అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జగన్ పాలనలో ప్రజలకు గానీ, గుడి విగ్రహాలకు గానీ భద్రత లేదని టీడీపీ అధినేత చంద్రబాబు షాకింగ్ అలిగేషన్స్ చేశారు.
ఈ ఘటన వైసీపీ ప్రభుత్వానికి ఒక మచ్చ తెచ్చి పెట్టింది. పిఠాపురం, కొండ బిట్రగుంట, అంతర్వేదిలో ఇలాంటి ఘటనలపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా వ్యవహరించకపోవడం వల్లే చారిత్రక ఆలయంలో అకృత్యాలు జరిగాయని పవన్ ధ్వజమెత్తారు. ఈ సంఘటన కంటే ముందు అంతర్వేదిలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ రథాన్ని దగ్ధం చేశారు. ఆ పని ఎవరు చేశారో వారిని వైసీపీ పట్టుకోవడంలో విఫలం అయింది.
ఆంధ్రప్రదేశ్‌లో 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఆ సమయం నుంచి దేవాలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం, ఆలయ రథాల ధ్వంసం వంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. కేంద్రం కూడా ఈ ఇన్సిడెంట్స్ పై కన్నెర్ర చేసింది. ఈ ఘటనలపై సీబీఐ విచారణ జరిపించాలని పవన్ డిమాండ్ చేశారు. చంద్రబాబు కూడా ఈ విధ్వంసాన్ని ఖండిస్తూ అధికార ప్రభుత్వాన్ని నిందించారు. ఆలయ దాడులను జగన్ మౌనంగా చూస్తున్నారని ఆరోపించారు.
జస్ట్ 19 నెలల వ్యవధిలోనే ఏపీలో 120కి పైగా దేవాలయాలపై దాడులు జరిగాయి. ఈ దాడులు పథకం ప్రకారం జరిగినవేనని, పిఠాపురంలోని ఆరు ఆలయాల్లో 23 విగ్రహాలను ధ్వంసం చేశారని ఆరోపణలు వచ్చాయి. గుంటూరులోని దుర్గమ్మ ఆలయాన్ని కూడా కూల్చివేశారు. ఇక అప్పట్లో విజయనగరంలో 400 ఏళ్ల నాటి రాముడి విగ్రహం యొక్క శిరస్సును ఖండించడం దారుణమని బీజేపీ కార్యదర్శి సునీల్ దేవధర్ అన్నారు. ఈ పని చేసిన వాళ్లు తాలిబన్లు కంటే కిరాతకులు అని కూడా అన్నారు.