యాదాద్రి గుట్టపై రాజకీయం.. శిలలపై కేసీఆర్ బొమ్మలు ?

Veldandi Saikiran

* కేసీఆర్ పాలనలో యాదాద్రి పునర్నిర్మాణం
* 2022 సంవత్సరంలో యాదాద్రి ఆలయం పునః ప్రారంభం
* యాదాద్రి ఆలయంలో కేసీఆర్ బొమ్మలు
* కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక దళిత నేతలకు అవమానాలు


తెలంగాణ రాష్ట్రంలో... తిరుమల తిరుపతి దేవస్థానం అంతటి స్థాయిలో యాదాద్రి  దేవాలయాన్ని రూపొందించారు. గతంలోనే భువనగిరి జిల్లాలో యాదాద్రి దేవాలయం ఉంది. అయితే...  తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత... తిరుమల క్షేత్రం తరహాలో యాదాద్రిని.. చేయాలని అప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే.. 2014 నుంచే ఈ పనులు ప్రారంభించారు కేసీఆర్.

విదేశాల నుంచి శిల్పులను తీసుకువచ్చి... యాదాద్రిని.. నిర్మించారు కేసీఆర్.  ఈ క్రెడిట్ మొత్తం కెసిఆర్  కే వెళ్తుందని చెప్పవచ్చు. కెసిఆర్ పేరు వినగానే అందరికీ తెలంగాణ రాష్ట్రం, కాలేశ్వరం అలాగే యాదాద్రి టెంపుల్ ఏ గుర్తుకు వస్తుంది. 2022 సంవత్సరంలో.. ఈ దేవాలయాన్ని ప్రారంభించారు కేసీఆర్. అయితే ఈ ఆలయం నిర్మించేటప్పుడు అనేక వివాదాలు వచ్చాయి.  ఈ ఆలయం పనులను ఎక్కువ శాతం ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారికి ఇచ్చినట్లు.. రేవంత్ రెడ్డి లాంటి నేతలు ఆరోపణలు చేశారు.

అలాగే ఆలయంలో శిలలపై కేసీఆర్ బొమ్మలు.. కూడా వేసినట్లు వార్తలు వచ్చాయి. అప్పట్లో తీవ్రస్థాయిలో ఈ అంశం హాట్ టాపిక్ అయింది. దీంతో... శిలలపై కేసీఆర్ బొమ్మలను తొలగించారు. అయితే ఈ యాదాద్రి ఆలయం నిర్మాణంలో అవినీతి జరిగిందని కూడా  కాంగ్రెస్ నేతలు అప్పట్లో ఆరోపణలు చేశారు.  కానీ యాదాద్రి ఆలయం పూర్తయిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగం అక్కడ విపరీతంగా పెరిగింది.
యాదాద్రి పరిధిలో భూముల ధరలు.. ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల అధికారంలోకి వచ్చిన తర్వాత... ముఖ్యమంత్రి స్థాయిలో రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్లారు. అక్కడి కట్టడాలను చూసి షాక్ కూడా అయ్యారు. అయితే.. ఈ సందర్భంగా పూజలో.. రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. పీటల పైన కూర్చుంటే.. కొండా సురేఖ అలాగే బట్టి కింద కూర్చోవడం వివాదంగా మారింది. డిప్యూటీ ముఖ్యమంత్రి అయిన బట్టి నీ కింద కూర్చో పెట్టడం.. పట్ల రేవంత్ రెడ్డి పై తీవ్ర వ్యతిరేకత కూడా వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: