శ్రీవారి దర్శనం : వీఐపీల కోసమేనా.. సామాన్య భక్తుల ఇబ్బందులు పట్టవా?

frame శ్రీవారి దర్శనం : వీఐపీల కోసమేనా.. సామాన్య భక్తుల ఇబ్బందులు పట్టవా?

praveen
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం ఎంత ప్రఖ్యాతిగాంచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేశంలో ఉన్న ప్రముఖ ఆలయాలలో ఇది ఒకటి. ఆపదమొక్కులవాడిగా ఆపద్బాంధవుడుగా కోరిన కోరికలు తీర్చే కొంగుబంగారంగా ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువుదీరాడు. అయితే కేవలం సామాన్యులు మాత్రమే కాదు సంపన్నులు సైతం శ్రీవారిని దర్శించుకునేందుకు తరలివస్తూ ఉంటారు. కేవలం రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాకుండా దేశ నలుమూలల నుంచి కూడా ఇక శ్రీవారి దర్శనం కోసం ఎంతో మంది భక్తులు వస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.

 ప్రతిరోజు ఏకంగా ఇలా భక్తుల సంఖ్య వేలల్లోనే ఉంటుంది. అయితే శ్రీవారి దర్శనానికి వచ్చే సామాన్య భక్తులకు ఎదురవుతున్న ఇబ్బందులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. విఐపి లకు కేవలం రెండు మూడు గంటల్లో దర్శన భాగ్యం కలుగుతుంటే అటు సామాన్య భక్తులు మాత్రం ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి ఏడుకొండలు ఎక్కుతున్నారు.  సరైన వసతులు లేక ఒక్క రోడ్లపైనే పడి కాపులు కాస్తున్నారు. కంపార్ట్మెంట్లలో గంటల తరబడి ఎదురు చూస్తున్నారు. తిరుమలలో అడుగుపెట్టింది మొదలు మళ్లీ తిరుమలలో దర్శనం ముగించుకుని కొండ దిగే వరకు సామాన్యభక్తుల తిప్పలు అన్ని ఇన్ని కావు.

 ప్రభుత్వాలు మారుతున్న పాలకమండళ్లు మారుతున్న భక్తులకు మాత్రం వసతుల కల్పన జరగడం లేదు. దీంతో ఏడుకొండలవారి దర్శనం అంటే కేవలం దైవదర్శనం మాత్రమే కాదు ఇక కళ్ళ ముందు సమస్యలు కూడా దర్శనమిస్తున్నాయి అనడంలో సందేహం లేదు. అయితే ఇలాంటి వ్యయ ప్రయాసలకు ఓర్చి ముందుకు సాగుతూ.. ఏడుకొండల వాడిని దర్శించుకోవడం అంత సులభమైన విషయమేమీ కాదు. రోజురోజుకీ భక్తుల సంఖ్య పెరుగుతున్న అటు వసతులు మాత్రం పెరగడం లేదు. కొండపైకి రాగానే సామాన్య భక్తులకు ముందు కనిపించే పెద్ద సమస్య వసతి కాటేజీ లో ఉన్న భక్తుల రద్దీకి తగినంత వసతులు ఉండవు. విఐపి భక్తులకు ప్రత్యేక కాటేజీలు వస్తువులు ఉన్నాయి. బ్రేక్ స్పెషల్ పేరుతో మూడు గంటల్లోనే వెంకన్న దర్శనం కూడా పూర్తవుతుంది. కానీ సామాన్య భక్తులకు వసతి సదుపాయాలు అంతంత మాత్రమే ఉన్నాయి. దీంతో టీటీడీ బోర్డు అటు విఐపి లకే ప్రాధాన్యత ఇస్తుందని సామాన్య భక్తులను అస్సలు పట్టించుకోవట్లేదు విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు ఏపీలో కొలువు దీరిన టిడిపి ప్రభుత్వం అయినా సామాన్య భక్తుల ఇబ్బందులను అర్థం చేసుకొని మరిన్ని వసతులు కల్పించాలని కోరుతున్నారు భక్తులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: