చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్ మీటింగ్ వార్తల్లో నిజం లేదా.. అసలేం జరిగిందంటే?

Reddy P Rajasekhar
ఈరోజు ఉదయం నుంచి చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్ మీటింగ్ అంటూ వార్తలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అయ్యాయి. ఏపీకి తారక్ 50 లక్షల రూపాయల విరాళాన్ని వరద బాధితుల సహాయార్థం ప్రకటించారు. అయితే ఆ మొత్తానికి సంబంధించిన చెక్కును ఇవ్వడానికి తారక్ చంద్రబాబును కలవనున్నారని వార్తలు వినిపించాయి. తారక్ తో పాటు రామ్ చరణ్ సైతం వెళ్లనున్నారని ప్రచారం జరిగింది.
 
అయితే వైరల్ అవుతున్న వార్తలు నిజమా అని ఆరా తీస్తే ఆ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని వెల్లడైంది. జూనియర్ ఎన్టీఆర్ చేతికి కొన్నిరోజుల క్రితం ఒక గాయం అయిన సంగతి తెలిసిందే. ఆ గాయం వల్ల తారక్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది. దేవర సినిమా ప్రమోషన్స్ వర్క్స్ భారం కూడా యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.
 
ఎవరో కావాలని చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్ మీటింగ్ అంటూ ఫేక్ వార్తలను ప్రచారంలోకి తెచ్చారని ఇండస్ట్రీ వర్గాల టాక్. చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్ లను ఒకే ఫ్రేమ్ లో చూడాలని నందమూరి ఫ్యాన్స్ భావిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా రిలీజ్ కు సమయం దగ్గర పడుతోంది. చంద్రబాబు నాయుడు సైతం వరుస మీటింగ్స్ తో బిజీగా ఉన్నారు.
 
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన సమయంలో జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెప్పిన సంగతి తెలిసిందే. చంద్రబాబు ఎన్టీఆర్ మధ్య గ్యాప్ ఉందని చాలామంది భావిస్తారు. రాబోయే రోజుల్లో ఈ గ్యాప్ తగ్గుతుందేమో చూడాల్సి ఉంది. ఎన్టీఆర్ దేవర సినిమా 1000 కోట్ల రూపాయల టాప్ రేంజ్ లో కలెక్షన్లు అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. దేవర సినిమా సక్సెస్ సాధిస్తే తారక్ ట్రిపుల్ హ్యాట్రిక్ దిశగా అడుగులు మొదలుకానున్నాయని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: