రేవంత్ రెడ్డి: యువతరానికి కేరాఫ్ అడ్రస్.. క్రీడాకారులకు అండగా..!

frame రేవంత్ రెడ్డి: యువతరానికి కేరాఫ్ అడ్రస్.. క్రీడాకారులకు అండగా..!

Divya

•గ్రామీణ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు గుర్తింపు..
•యువతను స్పోర్ట్స్ దిశగా అడుగులు వేయించడమే ప్రధాన లక్ష్యం..
•క్రీడా రంగానికి రూ.364 కోట్లు కేటాయింపు..
(తెలంగాణ - ఇండియా హెరాల్డ్ )
రేవంత్ రెడ్డి పట్టుదలతో విజయం సాధించి.. తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యారు. తెలంగాణ కెసిఆర్ సొంతమని , ఆయన తప్ప అక్కడ మరెవరు సీఎంగా బాధ్యతలు చేపట్టలేరు అంటూ చాలామంది ధీమా వ్యక్తం చేస్తుండగా.. వాటన్నింటినీ తిప్పికొడుతూ అతి తక్కువ సమయంలోనే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇక నేడు వేగంగా తాను ప్రకటించిన పథకాలను అమలు చేస్తూ ప్రజల మన్ననలు పొందుతూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి అడుగులు వేస్తూ దూసుకుపోతున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
ఈ మధ్యకాలంలో చాలామంది ముఖ్యమంత్రులు బడుగు బలహీనవర్గాల ప్రజలపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్న విషయం తెలిసిందే. అందుకే మిగతా వర్గాల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం  అన్ని రాష్ట్రాలలో ఏం జరుగుతోంది.. ప్రజలు ప్రభుత్వాల నుంచి ఏం ఆశిస్తున్నారు.. అనే విషయాలపై ఫోకస్ చేస్తూ.. అన్ని  వర్గాల వారిని ఆదుకుంటూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.  ఇకపోతే ఇప్పుడు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్న రేవంత్ రెడ్డి,  క్రీడాకారులకు కూడా తమ వంతు ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా  క్రీడాకారుల కోసం ఒక గుడ్ న్యూస్ ప్రకటించారని చెప్పవచ్చు.
రాష్ట్రంలో క్రీడారంగాన్ని అభివృద్ధి పరచడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని క్రీడలలో తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపే దిశగా కృషి చేస్తున్నారని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ చైర్మన్ శివసేనారెడ్డి స్పష్టం చేశారు. ఇందుకోసం దేశంలో ఉన్న అత్యుత్తమ స్పోర్ట్స్ పాలసీని రూపొందిస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు.  రాష్ట్రంలోని ప్రతి క్రీడాకారుడికి చేయూతను అందించేలా యువత క్రీడల పట్ల ఆకర్షితుల అయ్యే విధంగా ఆరు నెలల్లో కొత్త స్పోర్ట్స్ పాలసీని తీసుకొస్తామని గురువారం ఎల్బీ స్టేడియంలో జరిగిన మీడియా సమావేశంలో పాల్గొని ఆయన ప్రసంగించారు. క్రీడా పాలసీలో పొందుపరిచే ప్రతి అంశాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలుసుకుంటున్నారని ఆయన తెలిపారు.
 అంతేకాదు క్రీడలకు ఇచ్చే ప్రాధాన్యత గురించి సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో స్పష్టంగా వివరించడమే కాదు బడ్జెట్లో రూ.364 కోట్లు క్రీడలకు కేటాయించామని స్పష్టం చేశారు. అలాగే ప్రతి లోక్సభ నియోజకవర్గంలో ఒక స్పోర్ట్స్ స్కూల్ ను ఏర్పాటు చేసి,  వాటిని రాబోయే స్పోర్ట్స్ యూనివర్సిటీకి అనుసంధానం చేస్తామని చెప్పారు . స్పోర్ట్స్ పాలసీలో భాగంగా ప్రతి క్రీడాకారుడు కూడా తమ వివరాలను ఆన్లైన్లో నమోదు చేసి అత్యంత పారదర్శకంగా.. అవసరమైన ఆర్థిక,  ఇతర సహకారాలు వాళ్ళకి కల్పిస్తామని తెలిపారు. గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు క్రీడా పోటీలు నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందిస్తామని తెలిపారు. మొత్తానికైతే అన్ని రంగాల వారిని దృష్టిలో పెట్టుకొని వేగంగా దూసుకుపోతూ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నారు రేవంత్ రెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: