జనసేన విషయంలో చంద్రబాబు ఘోర తప్పిదాలు.. గ్రౌండ్ లెవెల్ లో పరిస్థితి ఇదే!

frame జనసేన విషయంలో చంద్రబాబు ఘోర తప్పిదాలు.. గ్రౌండ్ లెవెల్ లో పరిస్థితి ఇదే!

Reddy P Rajasekhar
టీడీపీ, జనసేన పార్టీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేర్వేరు లక్ష్యాలతో రాజకీయాలను మొదలుపెట్టగా 2024 ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేయడం రెండు పార్టీలకు ప్లస్ అయిందనే సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమికి ఏకంగా 164 స్థానాల్లో విజయం దక్కిందంటే చంద్రబాబు విజన్, పవన్ క్రేజ్ కారణమని చెప్పడంలో సందేహం అక్కర్లేదు. వైసీపీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కూడా కూటమికి ఒక విధంగా కలిసొచ్చిందని చెప్పవచ్చు.
 
అయితే చంద్రబాబు సీఎం అయిన తర్వాత జనసేన విషయంలో చంద్రబాబు ఘోర తప్పిదాలు చేస్తున్నారు. జనసేన ఎమ్మెల్యే గెలిచిన ప్రాంతాలలో టీడీపీ నేతలకు సరైన గౌరవం దక్కడం లేదని అదే విధంగా టీడీపీ గెలిచిన ప్రాంతాలలో జనసేన నేతలకు ఇదే పరిస్థితి ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా బ్యానర్ చించిన ఘటనలో జనసేన నేతతో టీడీపీ నాయకుడు కాళ్లు పట్టించుకోవడం హాట్ టాపిక్ అవుతోంది.
 
ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులపై కేసులు నమోదు అయ్యాయని సమాచారం అందుతోంది. జనసేన నేతలకు సంబంధించి ఇలాంటి అవమానాలు జరగడం అంటే ఈ తప్పిదం చంద్రబాబు ఘోర తప్పిదం అనే భావించాలి. గ్రౌండ్ లెవెల్ లో పరిస్థితులను అర్థం చేసుకుని చంద్రబాబు ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పవచ్చు. చంద్రబాబు పవన్ ఎలా కలిసి ఉన్నారో టీడీపీ జనసేన నేతలు సైతం అదే విధంగా కలిసి ఉంటే పరిస్థితులు బాగుంటాయి.
 
జనసేన నేతలను అవమానించేలా టీడీపీ నేతలు వ్యవహరిస్తే భవిష్యత్తులో రెండు పార్టీల మధ్య గ్యాప్ ఏర్పడి విడిగా పోటీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. 2029లో కూటమి అధికారంలోకి రావాలంటే టీడీపీ, జనసేన విమర్శలకు తావివ్వకుండా పాలన సాగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. టీడీపీ, జనసేన నేతల భవిష్యత్తు ప్రణాళికలు ఏ విధంగా ఉండనున్నాయో చూడాలి.  చంద్రబాబు పొలిటికల్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: