ఇరుక్కున్న రేవంత్.. తెలంగాణలో 10 స్థానాల్లో ఉప ఎన్నికలు?

Veldandi Saikiran
తెలంగాణ రాష్ట్రంలో.. ప్రస్తుతం పార్టీ ఫిరాయింపుల కేసుపై రాజకీయాలు కొనసాగుతున్నాయి. టిఆర్ఎస్ పార్టీ తరఫున విజయం సాధించి... కాంగ్రెస్ లో చేరారు పదిమంది ఎమ్మెల్యేలు. అయితే ఇందులో మొదట కాంగ్రెస్ లో చేరిన దానం నాగేందర్, కడియం శ్రీహరి మరియు తెల్లం వెంకట్రావులపై కోర్టుకు వెళ్ళింది గులాబీ పార్టీ. ఈ తరుణంలోనే ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ మరి 90 రోజులు పూర్తయిన సందర్భంగా... తెలంగాణ హైకోర్టు సీరియస్ యాక్షన్ తీసుకుంది.
 

నెల రోజుల్లోపు ఈ ముగ్గురిపై తెలంగాణ స్పీకర్ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని... తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ ఈ ముగ్గురు నేతలపై వేటు వేయకపోతే... కచ్చితంగా హైకోర్టు వీరిని.. అనర్హుల్గా ప్రకటిస్తామని చెప్పకనే చెప్పింది హైకోర్టు. దీంతో ఈ ముగ్గురు పదవులు పోవడం గ్యారెంటీ అని విశ్లేషకులు కూడా చెబుతున్నారు. అయితే ఈ ముగ్గురి విషయం పక్కకు పెడితే.. కాంగ్రెస్ పార్టీలో చేరిన మరో ఏడుగురు పరిస్థితి అత్యంత దారుణంగా తయారయింది.
 వారు కూడా కాంగ్రెస్లో చేరి 90 రోజులకు దగ్గర వచ్చింది. కాబట్టి వారి పైన కూడా కోర్టు సీరియస్ గా వ్యవహరించే ఛాన్స్ ఉంది. అయితే ఇలాంటి నేపథ్యంలో ఈ పది మంది ఎమ్మెల్యేలకు.. ఒకే ఒక్క అవకాశం ఉంది. స్వయంగా 10 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలి. అలా కాదని కోర్టు చర్యలు తీసుకునే వరకు... పదిమంది రెబల్ ఎమ్మెల్యేలు వెయిట్ చేస్తే... వాళ్ల రాజకీయ భవిష్యత్తు అంధకారంలోకి వెళ్లడం గ్యారంటీ అంటున్నారు విశ్లేషకులు.
కాబట్టి... కాంగ్రెస్లో చేరిన ఈ పది మంది టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు త్వరలోనే రాజీనామా చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ విషయంలో రేవంత్ రెడ్డి కూడా ఎలాంటి.. స్కెచ్ లు వేసే ఛాన్సే లేదని చెబుతున్నారు. ఒకవేళ ఈ పదిమంది రాజీనామా చేస్తే... కచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయి. మహారాష్ట్రతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఈ పది నియోజకవర్గాలకు ఎన్నికలకు జరిగే ఛాన్స్ ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: