తెలంగాణలో "పీఏసీ" పంచాయితీ.. ఎందుకు ఈ పదవికి ప్రాధాన్యత?

frame తెలంగాణలో "పీఏసీ" పంచాయితీ.. ఎందుకు ఈ పదవికి ప్రాధాన్యత?

Veldandi Saikiran
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో... పిఎసి పంచాయతీ నడుస్తోంది. పీఏసీ పదవిని... పార్టీ ఫిరాయించిన అరికెపూడి గాంధీకి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. దీంతో ఈ పంచాయతీ... తెరపైకి వచ్చింది. పార్టీ ఫిరాయించిన దానం నాగేందర్, కడియం శ్రీహరి అలాగే తెల్లం వెంకట్రావు విషయంలో తెలంగాణ హైకోర్టు సీరియస్ అయిన రోజునే... ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవిని... నియమించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం.
 రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు పిఎసి చైర్మన్గా... పార్టీ ఫిరాయించిన అరికెపూడి గాంధీని నియామకం చేశారు. అయితే సాంప్రదాయం ప్రకారం... పిఎసి చైర్మన్ పదవి.... ప్రధాన ప్రతిపక్షాలు లేదా ప్రతిపక్ష నాయకుడు... అవసరమనుకుంటే ఇండిపెండెంట్గా గెలిచిన అభ్యర్థికి మాత్రమే... ఇవ్వాల్సి ఉంటుంది. ఇది భారత రాజ్యాంగం ప్రకారం రూపొందించబడింది. ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడు సిఫారసు చేసిన... నాయకున్ని మాత్రమే... పీఏసీ చైర్మన్ చేయాలి.
 కెసిఆర్ కూడా ముగ్గురు పేర్లు సిఫారసు చేశారట. హరీష్ రావు, గంగుల కమలాకర్ లేదా ప్రశాంత్ రెడ్డి  ఈ ముగ్గురిలో ఎవరో ఒకరికి పిఎసి చైర్మన్ పదవి ఇవ్వాలని కోరారట  కెసిఆర్. కానీ పార్టీ ఫిరాయించిన గాంధీకి.. ఈ పదవి కట్టబెట్టి రేవంత్ రెడ్డి సర్కార్ పెద్దతప్పిదమే చేసిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. టెక్నికల్ గా గాంధీ.. టిఆర్ఎస్ పార్టీ అయినప్పటికీ ఆయన ఇటీవల కాంగ్రెస్ లో చేరారు. ఈ విషయంపై కోర్టుకు వెళితే మళ్ళీ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఎదురు దెబ్బే తగులుతుంది.
 అసలు పిఎసి పదవి ప్రాధాన్యత ఏంటంటే... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో  ఎలాంటి అవకతవకులు జరిగినా ఒక పిఎసి చైర్మన్కు మాత్రమే తెలుస్తుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తప్పిదాలను...  అవినీతిని బయట పెట్టే అవకాశం చైర్మన్ కు మాత్రమే ఉంటుంది. అలాంటి పదవిని.. ప్రతిపక్షానికి ఇవ్వకుండా మళ్లీ.. కాంగ్రెస్లో చేరిన వ్యక్తికి ఇచ్చారు. అంటే అవినీతి చేస్తే బయటికి రాకూడదని ఉద్దేశంతో రేవంత్ రెడ్డి సర్కార్ వ్యవహరించినట్లు ఉందని.. విశ్లేషకులు చెబుతున్నారు.మరి.. దీనిపై గులాబీ పార్టీ కూడా గట్టిగానే పోరాటం చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: