ఆ నేతను వదల బొమ్మాలి వదలా అంటున్న టీడీపీ..జైలు తప్పదా.?

frame ఆ నేతను వదల బొమ్మాలి వదలా అంటున్న టీడీపీ..జైలు తప్పదా.?

Pandrala Sravanthi
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు అంటారు. కానీ ఆ నేత విషయంలో ఇదంతా రివర్స్ అవుతుంది. ప్రస్తుతం టిడిపికి ప్రధాన టార్గెట్ గా ఆయన నిలిచారు. ఒకప్పుడు టిడిపిలో వెలుగు వెలిగిన ఆ నేత, ప్రజెంట్ టీడీపీ కబంధహస్తాల్లో చిక్కుకోబోతున్నారు. మరి టిడిపి అధిష్టానం టార్గెట్ చేసిన ఆ నేత ఎవరు.. ఆయన ఎందుకలా తయారయ్యారు. వివరాలు ఏంటో చూద్దాం.. రాజకీయాల్లో ఉన్నారంటే ఏదో ఒక పదవి కోసం ఆశిస్తారు. కానీ ఈయన సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్న ఇప్పటివరకు ఒక్క పదవి అనుభవించలేదు. ఇంతకీ ఆయన ఎవరయ్యా అంటే దేవినేని అవినాష్.. ఒకప్పుడు టిడిపి పార్టీలో వెలుగు వెలిగిన అవినాష్  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లి టిడిపికి ప్రధాన టార్గెట్ అయ్యారు. 

ఆ పార్టీలో ఉన్నప్పుడు చంద్రబాబును లోకేష్ ను విపరీతంగా విమర్శించడమే కాకుండా  టిడిపి కేంద్ర కార్యాలయంపై  దాడి కేసులో అవినాష్ అనుచరులు ఉండడమే అని తెలుస్తోంది. అయితే అవినాష్ కుటుంబానికి టిడిపికి విడదీయరాని బంధం ఉంది.  అవినాష్ తండ్రి దేవినేని నెహ్రూ టిడిపి వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు. ఇప్పటికే దేవినేని కుటుంబానికి చెందినటువంటి దేవినేని ఉమా, దేవినేని వెంకటరమణ మంత్రులుగా పని చేశారు. విజయవాడలో టిడిపి అంటే దేవినేని, దేవినేని అంటే టిడిపి అనేవారు. తన కొడుకు అవినాష్ ను కూడా టిడిపిలో మంచి లీడర్ గా ఎదిగేలా చేశారు. 2016 లో టిడిపిలో చేరిన అవినాష్ రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. 2019లో కొడాలి నానిపై పోటీ చేసి ఓడిపోయి మంచి గుర్తింపు సాధించారు.

ఇలా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న అవినాష్ ఆ తర్వాత వైసీపీలో చేరి  టిడిపి నాయకుల పై విమర్శలు చేయడమే కాకుండా ప్రత్యక్ష దాడులకు కూడా దిగడంలో ఈయన ప్రధాన పాత్ర పోషించారట. దీంతో అవినాష్ ను ఏ పార్టీ అయితే ప్రోత్సహించి రాజకీయంగా ఎదిగేలా చేసిందో, ప్రస్తుతం అదే పార్టీకి అవినాష్ టార్గెట్ గా మారిపోయాడు. ప్రస్తుతం టిడిపి అధికారంలోకి రావడంతో అవినాష్ కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. అనేక కేసుల్లో ఇరుక్కున్న అవినాష్ ను ఎలాగైనా జైలుకు పంపాలని టిడిపి ఆయన కోసం  విపరీతమైనటువంటి కసరత్తులు చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: