ప్రకాశం బ్యారేజీ గేట్లపై వైసీపీ కుట్ర...తెరపైకి నందిగాం సురేష్ ?
ఈ ఘటనపై మొత్తం 5 కేసులు నమోదు చేసిన పోలీసులు.... బోట్ల యజమానులకు వైసీపీ నేత రామ్మోహన్ తో సంబంధాలు ఉన్నట్టు గుర్తించారట. ఇక దీనిపై మంత్రి నిమ్మల స్పందించారు. వరద పీక్ టైంలో 11.40 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చినప్పుడు 5 పడవలు వచ్చి ఢీ కొన్నాయని తెలిపారు. దీని వెనుక కుట్ర దాగి ఉందనే ఆనుమానం ఉందన్నారు. అదృష్టవశాత్తూ మెయిన్ కట్టడాలను బోట్లు తాకలేదని వెల్లడించారు. గేట్లను, కట్టడాలను తాకితే ఐదారు జిల్లాలు ఎంతో నష్టపోయేవని పేర్కొన్నారు.
ఇరిగేషన్ శాఖ నుంచి ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు వేగంగా జరుగుతోందని... ఒకే యజమానికి చెందినవి ఈ పడవలు అంటూ వ్యాఖ్యానించారు. పడవల ఓనర్ ఉషాద్రి తలశిల రఘురాంకు అనుచరుడు అన్నారు. నందిగం సురేష్ కనుసన్నల్లో నదుల్లో అక్రమంగా ఆరోజు డ్రెజ్జింగ్ చేసి ఇసుక తీసారని... ఈ పడవల ద్వారానే ఇసుక లూటీ చేశారని ఆరోపణలు చేశారు.ఆ పడవలకు వైసీపీ కలర్ కూడా వేసి మరీ ఇసుక తవ్వుకున్నారని... ప్రకాశం బ్యారేజీని డామేజ్ చేసి ప్రభుత్వానికి బర్డెన్ తేవాలని చూశారని బాంబ్ పేల్చారు.
అమరావతిపై ఆక్రోశంతో తోటల్ని తగలబెట్టిన చరిత్ర వైసీపీదని... ఐరన్ కౌంటర్ వెయిట్స్ లో కాంక్రిట్ వేసి సిధ్దం చేస్తున్నామన్నారు. అన్నదాతలకు ఉపయోగపడే బ్యారేజీలపై కుట్రచేస్తే వీరిని భగవంతుడు కూడా క్షమించడని... హెచ్చరించారు. ప్లడ్ వస్తే రూ. 1000 వస్తువులు కూడా పోకుండా జాగ్రత్తపడతామని.... కోటిన్నర పడవలు జాగ్రత్త పెట్టలేదని వెల్లడించారు. అందుకే అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు.