రాయలసీమలో మొదలైన టిడిపి బిజెపి మధ్య పోరు..!
1999లో టిడిపి నుంచి ఎంపీగా గెలిచిన కాలువ శ్రీనివాసులు.. 2004,2009 లో ఓడిపోయారు. 2014 నుంచి రాయదుర్గం ఎమ్మెల్యేగా కాపు రామచంద్రారెడ్డి గెలవడం జరిగింది. 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా శాసనసభ నుంచి పోటీ చేసి కాపు రామచంద్రారెడ్డి గెలిచారు. ఆ తర్వాత 2012లో మధ్యంతర ఎన్నికలలో వైసీపీలో చేరి మరొకసారి గెలిచారు కాపు రామచంద్రారెడ్డి. 2019లో కాల్వ శ్రీనివాసులు మీద కూడా భారీ విజయాన్ని అందుకున్నారు. అయితే 2024 లో టికెట్ ఇవ్వకపోవడంతో బీజేపీ పార్టీలోకి చేరారట.
అయితే పొత్తులో భాగంగా టిడిపి నుంచి కాల్వ శ్రీనివాస్ మరొకసారి నిలబడక రామచంద్రారెడ్డి సైలెంట్ గానే ఉన్నారు. గత ఐదేళ్లు వైసిపి ఎమ్మెల్యేగా పనిచేసిన కాపు రామచంద్రారెడ్డి సిబిఐ సీజ్ చేసినటువంటి ఐరన్ అమ్ముకున్నారనే విధంగా తీవ్రమైన ఆరోపణలు ఆయుధం మీద వినిపించాయి. అలాగే వైసిపి ప్రభుత్వం లో ఉన్న సమయంలో క్రషర్ యజమానుల నుంచి 200 కోట్ల రూపాయలు వసూలు చేశారని రూమర్స్ కూడా వినిపించాయి. అయితే వీటన్నిటి వెనక కూడా టిడిపి నేతల హస్తం ఉందని ఆయన ఆరోపిస్తున్నారు. కేవలం కాల్వ శ్రీనివాసులు ఇలాంటి ఆరోపణలు చేయిస్తున్నారు అనే విధంగా రామచంద్రారెడ్డి ఆరోపిస్తున్నారు. ఇలా ఇద్దరి మిత్రపక్షాల పార్టీల నేతల మధ్య నడుస్తున్న ఈ వార్ రెండు పార్టీల మధ్య వైర్యాన్ని సృష్టించేలా కనిపిస్తోంది. మరి అధిష్టానం వీరికి సర్ది చెబుతుందేమో చూడాలి.