ఆదిమూలం అవుట్‌.. స‌త్య‌వేడు ఇన్‌చార్జ్‌గా ఆ క‌మ్మ నేత ఫిక్స్‌..?

frame ఆదిమూలం అవుట్‌.. స‌త్య‌వేడు ఇన్‌చార్జ్‌గా ఆ క‌మ్మ నేత ఫిక్స్‌..?

RAMAKRISHNA S.S.
తిరుపతి జిల్లా సత్యవేడు టిడిపి ఎమ్మెల్యేగా ఉన్న కోనేటి ఆదిమూలంపై రాసలీల‌ల వ్యవహారంలో ఆరోపణలు రావడంతో తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. వాస్తవానికి కోనేటి ఆదిమూలం వైసిపి మనిషి.. 2014 ఎన్నికలలో సత్యవేడు నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన ఆదిమాలం .. 2019 ఎన్నికలలో మరోసారి అక్కడ నుంచే వైసీపీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే జగన్ ఈ ఎన్నికలలో ఆయనకు సత్య‌వేడు ఎమ్మెల్యే సీటు ఇచ్చేందుకు ఇష్టపడలేదు.. ఆయ‌న‌ను తిరుపతి నుంచి ఎంపీగా పోటీ చేయమని చెప్పారు. వెంటనే ఆదిమూలం ఎన్నికలకు ముందు టిడిపిలోకి వచ్చే టిడిపి కండువా కప్పుకుని తెలుగుదేశం పార్టీ నుంచి మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు అయితే తాజాగా రాసలీల‌ల వ్యవహారంలో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో ఇప్పుడు సత్యవేడు టిడిపి ఇన్చార్జ్ పగ్గాలు ఎవరికి ఇస్తారు అన్న చర్చ ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయ వర్గాలలో ప్రారంభమైంది.

సత్యవేడు టిడిపి ఇన్చార్జిగా శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎన్సీవి నాయుడుని నియమించే అవకాశాలు ఉన్నాయి. నాయుడు నియమకంపై తిరుపతి జిల్లాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎన్నికలకు ముందు నాయుడు వైసీపీ నుంచి టిడిపిలో చేరారు.. శ్రీకాళహస్తి టికెట్ ఆశించిన gopala krishna REDDY' target='_blank' title='బొజ్జల-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">బొజ్జల సుధీర్‌ను కాదని చంద్రబాబు ఇవ్వలేదు.. తాజాగా ఇప్పుడు సత్యవేడు పార్టీకి దిక్కు దివాణం లేకుండా పోయింది.. ఈ క్రమంలోనే సత్యవేడు టీడీపీకి ఇంచార్జ్ అవసరమూ ఏర్పడింది. దీంతో ఎన్సివీ నాయుడు పై టిడిపి అధిష్టానం మొగ్గు చూపుతున్నట్టు తెలిసింది. ఆ నియోజకవర్గంలో నాయుడికి మంచి పరిచయాలు ఉన్నాయి .. అందుకే నాయుడిని అక్కడ ఇన్చార్జిగా నిర్మించాలని డిమాండ్లు టిడిపి కార్యకర్తలు .. నాయకులు వస్తున్నట్లుగా తెలుస్తోంది. నాయుడు క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన వారు. 2004లో కాంగ్రెస్ నుంచి శ్రీకాళ‌హ‌స్తి ఎమ్మెల్యేగా గెలిచారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: