గణపయ్యకు కుడుములు, ఉండ్రాళ్ళు పెట్టడం వెనక.. సైంటిఫిక్ రీజన్ ఉందా?
ప్రతిరోజు కూడా ఆ గణనాథుడికి ఇష్టమైన ఆహార పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తూ.. ఇక పూజలు చేయడం చూస్తూ ఉంటాం. అయితే వినాయక చవితి వచ్చినప్పుడల్లా గణేశుడుకి సమర్పించే నైవేద్యాలలో కుడుములు ఉండ్రాళ్లు తప్పనిసరిగా ఉంటాయి. అయితే ఈ రెండు కూడా అటు గణనాథునికి ఇష్టమైన నైవేద్యాలు అని చెబుతూ ఉంటారు. అయితే పురాణాల్లో కూడా ఈ రెండు రకాల ఆహార పదార్థాల గురించి ప్రస్తావించారు అని చెప్పాలి. అయితే పెద్దలు ఏది చేసినా దాని వెనుక ఒక సైంటిఫిక్ రీసన్ ఉంటుంది అన్న విషయం అందరికీ తెలుసు. అయితే వినాయక చవితి సందర్భంగా ఇలా గణనాథునికి కుడుములు ఉండ్రాళ్ళు లాంటి ప్రసాదాలను నైవేద్యంగా పెట్టడం వెనుక కూడా ఇలాంటి సైంటిఫిక్ రీసన్ ఒకటి ఉందట.
ఈ దక్షిణాయన కాలంలో మనుషుల్లో జీవక్రియ నెమ్మదిగా ఉంటుందట. అరుగుదల ఆకలి రెండు పెద్దగా ఉండవట. ఈ నేపథ్యంలో బియ్యం పిండితో ఆవిరి మీద చేసిన వంటకాలు తేలికగా అరగడమే కాక.. శరీర ఆరోగ్యాన్ని, శక్తిని కూడా పెంచుతాయట. అందుకే ఇక వినాయక చవితి నాడు ఇలా జీర్ణక్రియను మరింత నెమ్మదించేలా చేసే ఆహారాలు కాకుండా ఇక త్వరగా అరిగిపోయి.. శరీరానికి శక్తినిచ్చే ఆహారాలను తినేందుకు వీలుగానే వినాయకుడికి కుడుములు ఉండ్రాళ్ళు లాంటివి నైవేద్యాలుగా పెట్టడమే కాదు అందరికీ వీటిని ప్రసాదంగా కూడా పంచుతూ ఉంటారని పెద్దలు చెప్పే మాట.