టిడిపి ఎమ్మెల్యే ఆదిమూలం రాజీనామా దిశగా అడుగు.. ఉప ఎన్నిక జరగబోతోందా..?

Divya
నిన్నటి రోజు నుంచి ఎక్కువగా సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం పైన పలు రకాల వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.. ముఖ్యంగా ఈ ఎమ్మెల్యే పైన పలు రకాల నిజాలు బయటపడ్డాయి. ఇలాంటి సమయంలోనే తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఈ ఎమ్మెల్యే పైన కేసు నమోదు అయినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా బాధితురాలు వరలక్ష్మి ఫిర్యాదు మేరకే ఈ కేసు నమోదు చేసినట్లుగా పోలీసులు తెలియజేస్తున్నారు. సెక్సువల్ హరాస్మెంట్ చేస్తూ తన శారీరకంగా అనుభవిస్తూ రేప్ చేసినట్లుగా బాధితులు ఫిర్యాదులు తెలియజేసినట్లు పోలీసులు సైతం తెలియజేశారు.

 105,109  రూములలో తన ప్రమేయం లేకుండానే ఇలా అత్యాచారం చేసినట్లుగా ఈ కేసులో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది ఆ మహిళ. ముఖ్యంగా ఆ టిడిపి ఎమ్మెల్యే ఆదిమూలంపైన సెక్షన్ 430, కింద నమోదు చేసినట్లు సమాచారం. ఒక హోటల్లో సీసీ ఫుటేజ్ లు పోలీసులు కూడా సేకరించినట్లు సమాచారం  రేపు మాపో తన ఎమ్మెల్యే పదవికి కూడా ఆదిమూలం రాజీనామా చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు టిడిపి వర్గాలనుంచి వార్తలయితే వినిపిస్తూ ఉన్నాయి.

సత్యవేడు టిడిపి ఎమ్మెల్యే ఆదిమూలం పైన  అధిష్టానం కూడ చాలా కోపంగా ఉన్నట్లు సమాచారం.ముఖ్యంగా టిడిపి మహిళా కార్యకర్తల పైన ఇలాంటి లైంగిక వేధింపులు చేయడం సహించని అధిష్టానం ఆదిమూలం  ను సస్పెండ్ చేసినట్టుగా తెలుస్తోంది. వ్యవహారాన్ని సైతం  మొత్తం సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లినట్లుగా తెలుస్తోంది.ఆయన వెంటనే ఆదిమూలం పైన కూడా సస్పెన్స్ వేట కొనసాగించారు. త్వరలోనే ఆదిమూలం కూడా పదవికి రాజీనామా చేయించేలా చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు సమాచారం. అలాగే నిన్నటి రోజున ఈ టిడిపి ఎమ్మెల్యేను పార్టీ నుంచి సస్పెన్షన్ చేశారు. ఒకవేళ రాజీనామా చేస్తే త్వరలో కూడా సత్యవేడులో ఉప ఎన్నికలు రాబోతున్నట్లు సమాచారం. మరి ఏం జరుగుతుందో చూడాలి మరి. ఉప ఎన్నికలు వస్తే ఏం జరుగుతుందనే విషయం ప్రజలు కూడా ఆసక్తిగా చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: