బాలయ్యపై రేవంత్ రెడ్డి కుట్రలు ?
ముందుగా చెప్పినట్లు బాలయ్య స్వర్ణోత్సవం వేడుకకు... సీఎం రేవంత్ రెడ్డి వెళ్తారని అందరు అనుకున్నారు. దీంతో తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వానికి సంబంధించిన సావి మీడియాను ఈవెంట్ వద్దకు పంపించారట. రేవంత్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో... లైవ్ పెట్టాలని సావి మీడియా భావించిందట. అయితే దీన్ని బాలకృష్ణ ఈవెంట్ నిర్వహిస్తున్న శ్రేయాస్ మీడియా అడ్డుకుందట.అంతేకాదు తెలంగాణ సీఎంవో ఉద్యోగుల పైన శ్రేయాస్ ఈవెంట్ ని నిర్వాహకులు దాడికి కూడా చేశారట.
అయితే ఈ విషయం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరకు వెళ్లింది. అయితే తమ ఉద్యోగులపై దాడి చేసినందుకు నిరసనగా... ఆ ఈవెంట్ కు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లలేదని సమాచారం. వరదల నేపథ్యంలో... తాను కూడా బాలకృష్ణ ఈవెంట్ కు వెళ్లలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. తన అనుచరులతో చెప్పారట.అయితే అసలు విషయం బయటికి రాకుండా... సీఎం రేవంత్ రెడ్డి చూసుకున్నారట. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.