సూర్యాపేట జిల్లాలో వరదలు బీభత్సం.. సామాన్యులే కాదు రైతులకు తీవ్ర నష్టమే..?

Suma Kallamadi
* తెలంగాణలో పోటెత్తిన వరదలు  
* జలదిగ్బంధంలో సూర్యాపేట జిల్లా  
* వేల ఎకరాల్లో పంట నష్టం
( తెలంగాణ - ఇండియా హెరాల్డ్)
సెప్టెంబర్ 1వ తేదీన కురిసిన వర్షాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఒకటే కాకుండా తెలంగాణ రాష్ట్రం కూడా జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. ముఖ్యంగా ఖమ్మం, కోదాడ, సూర్యాపేట వంటి జిల్లాల్లో వరదలు సముద్రాలను తలపిస్తున్నాయి. వానదేవుడు ఇంకా ఈ ప్రాంతాలపై ప్రతాపం చూపిస్తూనే ఉన్నాడు. ఇప్పటికీ కురుస్తున్న వర్షాల కారణంగా వరదలు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. సూర్యాపేట జిల్లా వాసులు కూడా ఈ వరదల కారణంగా నానా ఇక్కట్లు పడుతున్నారు. జిల్లాలో వరదలు పోటెత్తడం వల్ల రైతులు కోట్ల విలువైన పంటలను నష్టపోయారు. అప్పుడు తెచ్చి మరి వేసిన పంట వరదల పాలు కావడంతో వారు కన్నీరు మున్నీరవుతున్నారు.
అధికారిక లెక్కల ప్రకారం సూర్యాపేట జిల్లాలో 35,149 ఎకరాలు నీట మునిగాయి. ఈ ఎకరాల్లో పంట వేసి నష్టపోయిన ప్రతి ఒక్కరికి మళ్ళీ విత్తనాలు ఎరువులు ఉచితంగా అందజేస్తామని ప్రభుత్వం చెబుతోంది కానీ మళ్ళీ కష్టపడి పంట వేయడం రైతులకు పెద్ద సవాల్ గా మారింది. ఇక్కడ వరదల తీవ్రత ఎంతగా ఉంది ప్రజలు ఎంతమైనా నష్టపోయారు అనేది అంచనా వేయడానికి అలాగే తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించడానికి రేవంత్ రెడ్డి ఒక రివ్యూ మీటింగ్ కూడా కండక్ట్ చేశారు.
ఎగువ ప్రాంతాల నుంచి లోతట్టు ప్రాంతాలలోకి వరదలు కంటిన్యూ గా పోటెత్తుతున్నాయి. ముఖ్యంగా మూసి నదిలోకి నీరు రావడం వల్ల సూర్యాపేట జిల్లాలో ఉన్న నీటి వనరులు పొంగిపొర్లుతున్నాయి. వాటి పరిసర ప్రాంతాల్లో ఉన్న గ్రామాలన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతున్నాయి. ముఖ్యంగా పాలేరు రిజర్వాయర్ పొంగిపొర్లతో మిగతా ప్రాంతాలను కూడా నీటిలో ముంచుతుంది. వరద నీరు ఎప్పటికప్పుడు భారీ ఎత్తున కంటిన్యూగా రావడం వల్ల అధికారులు పరిస్థితిని చాలా దగ్గరగా పరిశీలిస్తున్నారు. ఈ వరదల కారణంగా తెలంగాణ రాష్ట్రం దాదాపు 6 వేల కోట్లు నష్టపోయిందని అంచనా. ఆదివారం ఒక్కరోజు వచ్చిన వర్షమే ఇంత నష్టం కలిగించింది, ఒకవేళ ఇలాంటి వర్షాలు మరి కొద్ది రోజులు కురిస్తే పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు లోతట్టు ప్రాంతాల నివాసుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: