హైదరాబాద్ మహానగరం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా... దేశంలోనే అతిపెద్ద నగరంగా హైదరాబాద్కు మంచి గుర్తింపు ఉంది. చాలా పెద్ద పెద్ద కంపెనీలు హైదరాబాదులో... తమ కార్య కలాపాలను నిర్వహించుకుంటున్నాయి. అన్ని ఫెసిలిటీలు కంపెనీలకు... ప్రతి ప్రభుత్వం కల్పించడంతో.. హైదరాబాద్ బ్రాండ్ విపరీతంగా పెరిగింది.
రోడ్లు, మంచినీటి సౌకర్యం, ఎలాంటి హింస ఘటనలు లేని నగరంగా హైదరాబాద్ అభివృద్ధి చెందింది. అయితే హైదరాబాద్ మహానగరానికి వరదలు మాత్రం పెద్ద తలనొప్పిగా మారాయి. చిన్నపాటి వరద వస్తే చాలు హైదరాబాద్ మొత్తం చిత్తడి అవుతుంది. హైదరాబాదులోని చాలా బస్తీలు వరద తాకిడికి మునిగిపోతున్నాయి. కొన్నిసార్లు కార్లు కూడా కొట్టుకుపోతున్నాయి. కెసిఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చాలాసార్లు వరదలు వచ్చాయి.
అలాగే 2010 సంవత్సరంలో కూడా హైదరాబాద్ మహానగరంలో విపరీతంగా వరదలు రావడంతో ప్రజలు నానా అవస్థలు పడ్డారు. అయితే కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వరదలను కట్టడి చేసేందుకు చాలా చర్యలే తీసుకున్నారు. ఇక ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కూడా వరదలు అదే స్థాయిలో వస్తున్నాయి. అయితే రేవంత్ రెడ్డి మాత్రం భవిష్యత్తును ఆలోచించి... హైడ్రా అనే కొత్త చట్టాన్ని తీసుకువచ్చారు.
హైదరాబాదులో ముఖ్యంగా వరదలు రావడానికి కారణం చెరువులు కబ్జాలు , నాళాల పై అక్రమ నిర్మాణాలు చేపట్టడమే. అయితే వాటిని గుర్తించి అక్రమ కట్టడాలను ధ్వంసం చేసేందుకు హైడ్రాను తీసుకొచ్చారు రేవంత్ రెడ్డి. ఈ హైడ్రాను హైదరాబాద్ మహానగరంలో చాలా సమర్థవంతంగా అమలు చేస్తున్నారు. ఒకవేళ హైడ్రా అధికారులు చాలా పకడ్బందీగా చేస్తే హైదరాబాద్ మహానగరం చాలా అభివృద్ధి చెందుతుందని కొంతమంది విశ్లేషకులు చెబుతున్నారు. అక్రమ కట్టడాలు కూల్చివేస్తే వరదలు వచ్చినా హైదరాబాద్కు ఎలాంటి డోకా ఉండదని చెబుతున్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రo లో ఏ సర్కార్ ఉన్నా... ఆ దిశగా అడుగులు వేయాలని అంటున్నారు.